తెలంగాణకు అమిత్ షా
29-09-2026 | 07:22am
హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) అక్టోబర్ 4న తెలంగాణలో పర్యటించనున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లిలో అమూల్ సంస్థ ఏర్పాటు చేస్తున్న మిల్క్ బల్క్ యూనిట్‌కు ఆయన భూమిపూజ చేయనున్నారు. 5 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఈ యూనిట్ నిర్మించనున్నారు. అనంతరం నిర్వహించే రైతు బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.