రెండు ఎమ్మెల్సీ స్థానాలపై బీజేపీ ఫోకస్

29-09-2026 | 07:03am

హైదరాబాద్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల(Graduate MLC elections)ను దృష్టిలో పెట్టుకుని బీజేపీ కార్యాచరణను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై వర్క్‌షాప్ నిర్వహించనుంది.ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రెండు కమిటీలను ఏర్పాటు చేసిన బీజేపీ.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అలాగే వరంగల్-నల్గొండ-ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంపైనా పార్టీ నాయకత్వం ఫోకస్ పెట్టింది.ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఓటర్ల నమోదు విధానం (ఎల్‌రోల్‌మెంట్)పై పార్టీ నేతలకు వర్క్‌షాప్‌లో అవగాహన కల్పించనున్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు, ఎన్నికల సన్నద్ధతపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు.

మరిన్ని వార్తలు