మగాళ్లు జిందాబాద్ సెటైరికల్ చిత్రం
యంగ్ హీరో శ్రీ నందు(Sri Nandu), స్టార్ కమెడియన్స్ వెన్నెల కిషోర్(Vennela Kishore), వైవా హర్ష ప్రధాన తారాగణంగా నార ప్రవీణ్ రచనాదర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను గోల్డెన్ ఆర్క్ ప్రొడక్షన్ బ్యానర్(Golden Arc Production banner)పై ప్రసాద్ భాస్కర్ల, చైతన్య వంగవరపు నిర్మిస్తున్నారు. లక్ష్మి దుర్గ, అక్షర గౌడ కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల, మదిన్ ఎస్కే స్వరాలు సమకూర్చుతుండగా, నేపథ్య సంగీతాన్ని మున్నా కాసి అందిస్తున్నారు.
డీవోపీగా సమీర్ కళ్యాణి(Samir Kalyani), ఎడిటర్‌గా శ్రీధర్ సోంపల్లి, ఆర్ట్ డైరెక్టర్‌గా అమ్ము కార్తీక్ పనిచేస్తున్నారు. ఈ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్ ‘మగాళ్లు జిందాబాద్’ అని ప్రకటించారు. టైటిల్ అనౌన్స్మెంట్ వేడుకలో హీరో శ్రీ నందు మాట్లాడుతూ.. “మగాళ్లు జిందాబాద్’ టైటిల్ చాలామందిలో ఆలోచనలను రేకెత్తిస్తుంది. మరికొందరికి నవ్వు తెప్పిస్తుంది. ఆడవాళ్లను డామినేట్ చేయడానికి ఈ టైటిల్ పెట్టలేదు.
మగవాళ్ల భావాలు, బాధలు, కష్టాలు చెప్పుకోవాలని భావించేవారి కోసమే ఈ టైటిల్. అప్పులు, ఈఎంఐ బాధలు మగవాళ్లకే తెలుసు. సమాజంలో ఎదురవుతున్న అనేక సవాళ్లను ఎదుర్కొనే నిలబడుతున్నందుకు ‘మగాళ్లు జిందాబాద్” అని తెలిపారు. “మగాళ్లు జిందాబాద్’ అందరికీ నచ్చుతుంది. సినిమాను తప్పకుండా ఆదరించండి” అని హీరోయిన్ లక్ష్మీదుర్గ కోరింది.
డైరెక్టర్ నార ప్రవీణ్ మాట్లాడుతూ.. “సొసైటీలో ఆడవారికి దక్కే కంఫర్ట్, న్యాయం, సింపతీ మగాడికి దక్కట్లేదనే టాపిక్‌ను సెటైరికల్ టోన్‌లో డీల్ చేస్తూ ఔట్ అండ్ ఔట్ కామెడీ జెనరేట్ చేశాం. ఇది ఒక సోషల్ సెటైరికల్ మూవీ” అని చెప్పారు. నిర్మాత ప్రసాద్ భాస్కర్ల మాట్లాడుతూ.. “హీరో శ్రీ నందుకు ‘మగాళ్లు జిందాబాద్’ మంచి కమర్షియల్ మైలేజ్ తీసుకొస్తుంది” అని చెప్పారు.