బాక్సాఫీస్‌పై ‘ది ప్యారడైజ్’ దండయాత్ర!

23-09-2026 | 11:59am

విడుదలకు ముందే రికార్డుల వేట..

నాని ‘ది ప్యారడైజ్’కు భారీ అడ్వాన్స్ బుకింగ్స్!

నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’(Nani The Paradise) విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్‌లో ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తుంది. తాజా ట్రేడ్ రిపోర్టుల ప్రకారం, దేశీయ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే భారీ స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్‌లో(North American market) సినిమా ప్రీమియర్ సేల్స్ దూసుకెళ్తున్నాయి. తాజా ట్రేడ్ రిపోర్టుల ప్రకారం The Paradise ప్రీమియర్ ప్రీ-సేల్స్ $1.1 మిలియన్ మార్క్‌ను దాటినట్లు వెల్లడైంది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీగా నమోదవుతున్నాయని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు వెల్లడించారు.

దేశీయంగా కూడా ‘ది ప్యారడైజ్’ బుకింగ్స్ జోరు కొనసాగుతోంది. బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కలిపి 9 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో గతంలో భారీ అంచనాలతో వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం(Guntur Kaaram), రాంచరణ్ పెద్ది ప్రీ-సేల్స్ రికార్డులను బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ‘ది ప్యారడైజ్’పై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. మరోవైపు, సినిమా విడుదలకు ముందే హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షోలపై భారీ స్పందన వస్తోంది. నాని–శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘దసరా’(Dasara ) తర్వాత మరోసారి ఈ జోడీ ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ‘ది ప్యారడైజ్’పై అంచనాలు మరింత పెరిగాయి. భారీ స్థాయిలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) సంగీతం అందించారు. మొత్తంగా చూస్తే.. థియేటర్లలో సినిమా విడుదల కాకముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో కనిపిస్తున్న జోరు ‘ది ప్యారడైజ్’పై ఉన్న క్రేజ్‌ను చూపిస్తోంది.

మరిన్ని వార్తలు