మిస్టర్ దెయ్యం టీమ్ కొబ్బరికాయ కొట్టారు!

24-10-2026 | 05:05am

శౌర్య ఆర్య సమర్పణలో అన్నే క్రియేషన్స్ బ్యానర్‌పై వెంకట్ నిమ్మలపూడి, సింధు అన్నే నిర్మిస్తున్న నూతన చిత్రం ‘మిస్టర్ దెయ్యం(Mr Deyyam)’కు కొబ్బరికాయ కొట్టారు. విజయ్ శంకర్, సిరి చౌదరి, ఖయ్యూమ్, పింగ్ పాంగ్ సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంజన అన్నే దర్శకత్వం వహించనున్నారు.

శుక్రవారం నిర్వహించిన సినిమా ప్రారంభ పూజా కార్యక్రమానికి మంచు మనోజ్, అలీ, విజయ్ కనకమేడల, ఆర్పీ పట్నాయక్, పట్నం మహేందర్ రెడ్డి, రమేశ్ పుప్పాల, సమీర్, చింటు, వీర శంకర్, రాజా వన్నెం రెడ్డి, విఎన్ ఆదిత్య, జ్యోత్స్న, లేబర్ కమిషనర్ గంగాధర్, కొరియోగ్రాఫర్ విజయ్ పోలకి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి మంచు మనోజ్ క్లాప్ కొట్టగా, అలీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. విజయ్ కనకమేడల ఫస్ట్ షాట్కి డైరెక్షన్ చేయగా.. వీఎన్ ఆదిత్య, ఆర్పీ పట్నాయక్ స్క్రిప్ట్ అందజేశారు.

మరిన్ని వార్తలు