27న ‘రుక్కురుక్కు రుక్మిణి’
కోర్ట్ చిత్రం తర్వాత న్యాచురల్ స్టార్ నాని(Natural Star Nani) యునానిమస్ ప్రొడక్షన్స్ మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో రాబోతోంది. అలియాస్ రుక్మిణి అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటిస్తుండగా, దండోరా ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మిస్తున్న అలియాస్ రుక్మిణి ఒక విలక్షణమైన కథనంతో ఆసక్తికరమైన ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటోంది. ఫస్ట్ సింగిల్ ‘రుక్కురుక్కు రుక్మిణి’ పాటను అక్టోబర్ 27న విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. సంప్రదాయ లుక్‌లో నితిన్ కూల్ అండ్ స్టైలిష్‌గా కనిపిస్తే, సంప్రదాయ చీరకట్టులో ఆఫియా సయ్యద్ అందంగా మెరిశారు. హీరో హీరోయిన్ల లుక్, పోస్టర్‌లోని విజువల్స్ ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ఈ చిత్రానికి జోమోన్ టీ. జాన్ ఐఎస్సీ డీవోపీ అందిస్తుండగా, విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్, సృజన అడుసుమిల్లి ఎడిటింగ్. ఈ చిత్రం డిసెంబర్ 4న విడుదల కానుంది.