పోరాట వీరుడి స్మరణలో జోడేఘాటుకు స్వాగతం!

26-10-2026 | 05:20am
  1. నేడు కుమ్రంభీం వర్ధంతి.. అధికారికంగా నివాళులు
  2. జల్.. జంగల్.. జమీన్ నినాదంతో పోరాడిన యోధుడి త్యాగం చిరస్మరణీయం

కుమ్రంభీం ఆసిఫాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): జల్.. జంగల్.. జమీన్ నినా దంతో(slogan of 'Jal, Jungle, Zameen')) ఆదివాసీల హక్కుల సాధన కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసి ప్రాణత్యాగం చేసిన ఆదివాసీ విప్లవ వీరుడు కుమ్రంభీం(Tribal revolutionary hero Kumram Bheem) వర్ధంతిని సోమవారం జోడేఘాట్లో అధికారికంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా కుమ్రంభీం స్మృతివనం వద్ద నివాళులర్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. భీం పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, అభివృద్ధిపై మరోసారి చర్చించనున్నారు.

ఆదివాసీ హక్కుల కోసం అలుపెరుగని పోరాటం

అడవి, భూమి, నీటిపై ఆదివాసీలకు హక్కులు ఉండాలని నినదించిన కుమ్రంభీం పోరాటం చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఆదివాసీలు తమ జీవనాధారాలపై స్వేచ్ఛగా హక్కులు కలిగి ఉండాలనే లక్ష్యంతో ఆయన సాగించిన ఉద్యమం గిరిజనుల్లో చైతన్యాన్ని నింపింది. నిజాం పాలనలో ఆదివాసీలు ఎదుర్కొన్న అణచివేత, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన 1940 అక్టోబర్ 27న జోడేఘాట్ ప్రాం తంలో జరిగిన పోరాటంలో అమరుడయ్యారు. ఆయన త్యాగం ఆదివాసీ ఉద్యమా లకు స్ఫూర్తిగా నిలిచింది.

జోడేఘాట్‌కు ప్రత్యేక గుర్తింపు

కుమ్రంభీం అమరత్వానికి ప్రతీకగా నిలిచిన జోడేఘాట్ నేడు ఆదివాసీ చరిత్ర, సంస్కృతి, పోరాట స్ఫూర్తికి నిలయంగా మారింది. ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ మ్యూజియం, స్మృతివనం, కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం జయంతి, వర్ధంతి సందర్భంగా అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన సేవలను స్మరించుకుంటున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆదివాసీలు, ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల నాయకులు జోడేఘాట్కు చేరుకుని నివాళులర్పిస్తున్నారు.

పోరాట స్ఫూర్తిని భావితరాలకు చాటాలి

కుమ్రంభీం జీవిత చరిత్రను, ఆయన చేసిన పోరాటాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, సమాజంపై ఉంది. ఆదివాసీ యువతలో విద్య, సామాజిక చైతన్యం, హక్కులపై అవగాహన పెంపొందించడంతోపాటు గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. గిరిజనుల సంప్రదాయాలు, సంస్కృతి, భాషలను పరిరక్షిస్తూ వారికి మెరుగైన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా భీం ఆశయాలకు ఆచరణాత్మక రూపం ఇవ్వవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

నివాళులతోపాటు ఆశయాల సాధనకు కృషి

కుమ్రంభీం వర్ధంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు కేవలం పూలమాలలు వేసి నివాళులర్పించడానికే పరిమితం కాకుండా ఆయన ఆశయాల సాధనకు మార్గదర్శకంగా నిలవాలని ఆదివాసీ సంఘాలు కోరుతున్నాయి. గిరిజనుల హక్కుల పరిరక్షణ, అటవీ భూముల సమస్యల పరిష్కారం, విద్యా, వైద్య సదుపాయాల విస్తరణ, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.

జల్.. జంగల్.. జమీన్ అంటూ కుమ్రంభీం ఇచ్చిన నినాదం నేటికీ ఆదివాసీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. ఆయన పోరాటాన్ని స్మరించుకోవడంతోపాటు ఆ పోరాట లక్ష్యాలను ప్రజల జీవితాల్లో ప్రతిబింబించేలా చర్యలు చేపట్టినప్పుడే నిజమైన నివాళి అర్పించినట్లవు తుందని గిరిజనులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు