ఈ బాలీవుడ్ భామే.. ఆ ‘రుక్మిణి’?!

12-10-2026 | 05:25am

టాలీవుడ్ హీరో నితిన్(Tollywood hero Nithiin) సరసన ఓ క్రేజీ బాలీవుడ్ భామ జోడీ కట్టబోతున్నట్టు ఫిల్మ్‌నగర్ సమాచారం. నేచురల్ స్టార్ నాని సమర్పణలో, ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో(Directed by Muralikanth Devasoth) తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘అలియాస్ రుక్మిణి’. యూనిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి గంటా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది.

ఈ చిత్రంలో టైటిల్ రోల్ అయిన ‘రుక్మిణి’(Rukmini) పాత్రను ఎవరు పోషిస్తున్నారనే సస్పెన్స్‌కు త్వరలోనే తెరపడనుంది. చిత్రబృందం ఈ రుక్మిణి క్యారెక్టర్‌ను ఎంతో వినూత్నంగా డిజైన్ చేసిందట. ఒక బోల్డ్ రొమాంటిక్ నవలా రచయిత్రి చుట్టూ తిరిగే కథ కావడంతో ఈ పాత్రపై భారీ అంచనాలున్నాయి. అక్టోబర్ 13న ఈ హీరోయిన్ ఎవరనే విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇదిలావుంటే, ఆ రుక్మిణి ఎవరో కాదు.. ఈమే అంటూ సోషల్‌మీడియాలో ఓ బాలీవుడ్ యువ కథానాయకి పేరు వైరల్ అవుతోంది. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు.. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్‌వాలా మేనకోడలు ఆఫియా సయ్యద్. ఇటీవల హిందీ ‘ప్రేమలు’ రీమేక్ (ప్రేమ్ కీటాను)తో వెండితెరకు పరిచయమైన యంగ్ బ్యూటీ ఆఫియా..

తాజా సినిమాలో నితిన్ సరసన హీరోయిన్‌గా నటిస్తోందని సమాచారం.  హిందీలో తొలిసారి ‘ప్రేమలు’ రీమేక్ చిత్రంలో వీర్ పహారియా సరసన నటించినప్పటికీ, ఆఫియా సయ్యద్‌కు మాత్రం మొదటి సినిమాతోనే సరైన హిట్ దక్కలేదు. ఆశించిన స్థాయిలో ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.

అయితే బాలీవుడ్‌లో మొదటి ప్రయత్నం నిరాశపరిచినప్పటికీ, ఈ యంగ్ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతుండటం అందరిలో క్యూరియాసిటీ పెరిగింది. ఇప్పటికే షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు డేట్ లాక్ చేశారు.

ఒక మధ్యతరగతి యువకుడిగా నితిన్ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్న ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. బాలీవుడ్ వారసత్వంతో వస్తున్న ఆఫియా, టాలీవుడ్‌లో నితిన్ పక్కన ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరిన్ని వార్తలు