హ్యాపీ బర్త్ డే టు ‘డార్లింగ్’

23-10-2026 | 05:10am

బిగ్గెస్ట్ సూపర్ స్టార్.. ప్రభాస్

భారీ పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ తనకంటూ అభిమానులను, ప్రేక్షకులను సంతోషపెడుతున్నారు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas). ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తూ భారతీయ సినిమా కీర్తిని కొత్త శిఖరాలకు చేరుస్తున్నారు ప్రభాస్. ఈశ్వర్ సినిమాతో మొదలైన ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ జర్నీ 24 ఏళ్లుగా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ సక్సెస్ ఫుల్‌గా కొనసాగుతోంది. అందరినీ ప్రేమించే తత్వమే ప్రభాస్‌ను అందరూ ఇష్టపడే డార్లింగ్‌లా మార్చేసింది.

స్టార్‌గా ప్రభాస్ స్టామినా బాక్సాఫీస్ రికార్డులు చెబితే, అందరూ ప్రేమగా పిలిచే డార్లింగ్ అనే మాట వ్యక్తిగా ఆయన గొప్పదనం చూపిస్తుంది. ప్రభాస్ కొత్త సినిమా వచ్చిందంటే అది ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులకు మరో చరిత్రను లిఖించినట్లే. రెబల్ స్టార్ భారీ లైనప్, ఆ సినిమాల్లో శ్రమతో, అంకితభావంతో, నటనా ప్రతిభతో తను చేస్తున్న క్యారెక్టర్స్, బ్యాక్ టు బ్యాక్ ఈ హ్యూజ్ మూవీస్ చేసేందుకు ఆయన పడుతున్న కష్టం.. ఇవన్నీ ప్రభాస్‌ను మరో స్టార్ అందుకోలేనంత ఎత్తులో నిలబెడుతున్నాయి. ఆయన అభిమానులు గర్వించేలా చేస్తున్నాయి.

పాన్ ఇండియా స్టార్ డమ్ దాటేసి గ్లోబల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. ఆయనకిప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేకమంది అభిమానులున్నారు. ప్రభాస్ ఇమేజ్ దేశ హద్దులు దాటి గ్లోబల్ రేంజ్‌కు స్టార్‌డమ్ వెళ్లింది. థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్, ఓవర్సీస్ బిజినెస్.. ఇలా ఏ విషయంలో చూసినా ప్రభాస్‌ను మరే స్టార్ హీరో అందుకోలేనంత స్థాయికి చేరుకున్నారు.  బాహుబలి 2, కల్కి 2898 ఎడి సినిమాలతో వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రెండుసార్లు సాధించిన ఏకైక స్టార్ ప్రభాస్. ఓవర్సీస్ మార్కెట్లో పది మిలియన్లకుపైగా వసూళ్లను సాధించిన తొలి హీరోగా ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేశారు.

ఆయనను అభిమానులే కాదు, ఆయనతో పనిచేసిన ప్రతి నటీనటులు, సాంకేతికవర్గం కూడా ఇష్టపడతారు. ఇటీవల ఓ పత్రికతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ప్రభాస్ లాంటి స్టార్ దొరకడం తన అదృష్టమన్నారు. సందీప్ వంగా దర్శకత్వంలో ఫౌజీ, దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న కల్కి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2లలో నటిస్తున్నారు. ఫౌజీ సమ్మర్‌లో విడుదల కానుంది. మనందరికీ ఇష్టమైన ప్రభాస్ ఇలాగే మరెన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు చేస్తూ, ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి కోరుకుంటూ విషేస్ తెలియజేద్దాం. హ్యాపీ బర్త్ డే టు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్.

మరిన్ని వార్తలు