మెగా జాబ్‌మేళా
మెగా జాబ్‌మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి
కాగజ్‌నగర్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): నిరుద్యోగ యువతకు(Unemployed youth) ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మెగా జాబ్‌మేళా(Mega Job Fair) నిర్వహిస్తున్నట్లు సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు(Sirpur MLA Dr. Palvai Harish Babu) అన్నారు. శనివారం కాగజ్‌నగర్‌లోని(Kagaznagar) బట్పల్లి చౌరస్తా సమీపంలోని పటేల్ గార్డెన్స్‌లో ప్రజాబంధు ఫౌండేషన్(Prajabandhu Foundation) ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాలో ఆయన మాట్లాడారు.
దివంగత సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తంరావు జ్ఞాపకార్థం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతేడాది నిర్వహించిన జాబ్‌మేళాలో 300 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని, ఈసారి కనీసం 500 మందికి ఉద్యోగాలు కల్పించేలా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానికంగా ఉద్యోగ అవకాశాలు పరిమితంగా ఉన్నందున యువత ఎక్కడ అవకాశం లభించినా ఉద్యోగాల్లో చేరాలని సూచించారు.
జాబ్‌మేళాలో 50 కంపెనీల ప్రతినిధులు పాల్గొని సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ఫార్మా, అగ్రికల్చర్ తదితర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. జీతం తక్కువగా ఉందని ఆలోచించకుండా అనుభవం కోసం ఉద్యోగంలో చేరాలని సూచించారు. జాబ్‌మేళాలో నమోదు చేసుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు లభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఫ్యాన్ ఇండియా 300 ప్లస్ కంపెనీల కన్సల్టెంట్ చందర్, సీనియర్ హెచ్‌ఆర్‌లు హిమబిందు, రాము, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, నాయకులు పుల్ల అశోక్, వీరభద్రచారి, కౌన్సిలర్లు తాజ్‌బాబా, చిప్పకుర్తి శ్రీనివాస్, విశ్వేశ్వరరావు, కొప్పుల శంకర్, మనోహర్‌గౌడ్, ఎలుమల మల్లయ్య, దెబ్బడి శ్రీనివాస్, చీరాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.