ఓటీటీలోకి తలైవా ఎంట్రీ.. డేట్ ఫిక్స్!

05-11-2026 | 12:28pm

సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం 'జైలర్ 2' (Jailer 2) ఓటీటీ (OTT Streaming) ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా నవంబర్ 12 నుంచి ప్రముఖ డిజిటల్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించింది.

నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 12న డిజిటల్ ప్రీమియర్ (Digital Premiere) కానుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

థియేటర్లలో రజనీకాంత్ అభిమానులను అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ఇంటి నుంచే చూసే అవకాశం కల్పిస్తోంది. ఓటీటీ విడుదల తేదీ ఖరారు కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు