హైదరాబాద్‌పై కేటీఆర్ ఆసక్తికర పోస్ట్!

05-11-2026 | 12:27pm

టీ-హబ్‌కు 11 ఏళ్లు.. హైదరాబాద్‌ను ఇన్నోవేషన్ హబ్‌గా మార్చిన టీ-హబ్

హైదరాబాద్: తెలంగాణ స్టార్టప్ రంగానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన T-Hub విజయవంతంగా 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదిక Xలో ప్రత్యేక పోస్టు చేశారు. యువత కలలకు రెక్కలు అందించడం, కొత్త ఆలోచనలకు ప్రోత్సాహం ఇవ్వడమే టీ-హబ్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

3,300కు పైగా స్టార్టప్‌లకు ప్రోత్సాహం

కేసీఆర్ హయాంలో హైదరాబాద్‌ను అంతర్జాతీయ Innovation Destinationగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో టీ-హబ్ ఏర్పాటైందని కేటీఆర్ గుర్తుచేశారు. 11 ఏళ్ల ప్రయాణంలో 3,300కు పైగా Startupsకు ఈ సంస్థ అండగా నిలిచిందన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు Mentors, Investors, Industry Leadersతో పాటు Global Opportunitiesను అందుబాటులోకి తీసుకొచ్చిందని వివరించారు. టీ-హబ్ కేవలం ఒక Startup Incubator మాత్రమే కాదని, తెలంగాణ ఆశయాలకు, Entrepreneurial Spiritకు ప్రతీకగా నిలిచిందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి Innovation Initiativesకు స్ఫూర్తిగా మారిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ Innovation Mapలో ప్రత్యేక స్థానంలో నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిందని కొనియాడారు.

రతన్ టాటా వ్యాఖ్యలను గుర్తుచేసిన కేటీఆర్

టీ-హబ్ ప్రారంభోత్సవ సమయంలో దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా చేసిన వ్యాఖ్యలను కూడా కేటీఆర్ తన పోస్టులో ప్రస్తావించారు. టీ-హబ్‌ను ఆయన ‘Face of Modern India’గా అభివర్ణించారని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లోనూ కొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తూ, Innovatorsకు అవకాశాలు కల్పించి, యువత కలలను సాకారం చేసే వేదికగా టీ-హబ్ మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.


మరిన్ని వార్తలు