ఆలయంలో అద్భుత దృశ్యం

05-11-2026 | 10:10am

ఏకాదశి పర్వదినాన పాండురంగని ఆలయంలో అద్భుత దృశ్యం

శ్రీ రుక్మిణీ సమేత పాండురంగ స్వామివారిని తాకిన సూర్యభగవానుడి కిరణాలు

భక్తులను మంత్రముగ్ధులను చేసిన అపురూప ఘట్టం

బాన్సువాడ, నవంబర్ 5 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ( Bansuwada Temple) పట్టణంలోని శాంతినగర్ కాలనీలో కొలువుదీరిన శ్రీశ్రీశ్రీ రుక్మిణీ సమేత పాండురంగ స్వామివారి(Sri Rukmini Sametha Panduranga Swamy) ఆలయంలో ఏకాదశి పర్వదినం సందర్భంగా గురువారం అపురూప ఆధ్యాత్మిక దృశ్యం ఆవిష్కృతమైంది. ఉదయం వేళ సూర్యభగవానుడి లేలేత కిరణాలు నేరుగా స్వామివారిని తాకడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. సూర్యకిరణాలు స్వామివారి విగ్రహాన్ని స్పృశించిన ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన భక్తులు పరవశించిపోయారు. ఈ అపురూప ఘట్టం భక్తుల్లో భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని నింపింది. ఏకాదశి పర్వదినాన చోటుచేసుకున్న ఈ దృశ్యం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మరిన్ని వార్తలు