బీఆర్ఎస్లోకి చేరికల జోష్
గులాబీ గూటికి నల్లా వినయ్ రెడ్డి.. కేటీఆర్ సమక్షంలో చేరిక
హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా రాజకీయాల్లో మరో చేరిక చోటుచేసుకుంది. లక్ష్మణచాంద మండలానికి చెందిన యువ నాయకుడు నల్లా వినయ్ రెడ్డి(Nalla Vinay Reddy) బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని పార్టీ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ వినయ్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. లక్ష్మణచాంద మండలంలో నల్లా వినయ్ రెడ్డికి, ఆయన కుటుంబానికి స్థానికంగా మంచి గుర్తింపు ఉంది.
మాజీ సమితి ప్రెసిడెంట్ భీమిరెడ్డి మనవడిగా ఆయనకు Political Background ఉంది. కుటుంబానికి గ్రామీణ ప్రాంతాల్లో పరిచయాలు, స్థానికంగా ఆదరణ ఉండటంతో ఆయన చేరికపై నిర్మల్ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. యువ నాయకుడి Entryతో జిల్లాలో పార్టీ కార్యకలాపాలు మరింత విస్తరించనున్నాయని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా, ఈ నెల 11న నిర్మల్లో కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా రైతు గర్జన బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు ముందు జరుగుతున్న నాయకుల చేరికలు పార్టీ శ్రేణుల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సభకు సంబంధించిన ఏర్పాట్లు, పార్టీ విస్తరణ కార్యక్రమాలపై నాయకత్వం దృష్టి సారించింది.