‘ది మెన్ వి ఫర్గాట్’.. ఏం చెప్పబోతున్నారు?
రణబాలి ప్రమోషన్స్‌లో ‘ట్రూత్ 3’.. ‘ది మెన్ వి ఫర్గాట్’ ఎపిసోడ్ విడుదల
విజయ్ దేవరకొండ(Vijay Deverakonda ), రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ సినిమా ప్రమోషన్స్(Ranabali Movie Promotions) జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ‘నెవర్ ఫర్గెట్ ట్రూత్’ సిరీస్‌లో భాగంగా రూపొందించిన ‘ట్రూత్ 3’ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
‘ది మెన్ వి ఫర్గాట్’(The Men We Forgot) పేరుతో వచ్చిన ఈ ఎపిసోడ్ ద్వారా సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కథకు సంబంధించిన అంశాలను నేరుగా వెల్లడించకుండా, ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచే విధంగా ఈ ప్రమోషనల్ వీడియోను రూపొందించారు.
రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రణబాలి’ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో యాక్షన్, అడ్వెంచర్ అంశాలకు ప్రాధాన్యం ఉన్నట్లు చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించింది. విజయదశమి సందర్భంగా అక్టోబర్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.