రోమియో జూలియట్ కనెక్ట్ అవుతుంది

25-10-2026 | 05:10am

హర్షిత్, విశాఖ ధిమాన్ జంటగా నటిస్తున్న ‘రోమియో జూలియట్’ సినిమా(Romeo Juliet Film)థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. భార్గవ్ మాచర్ల రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ సమర్పిస్తుండగా, నవరస ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుందీప్ ఎన్, వెంకటేశ్వరరావు చల్లగుళ్ల నిర్మిస్తున్నారు. నవంబర్ 13న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ సారీ బేబీ సాంగ్ లాంచ్ చేశారు. హీరో హర్షిత్ మాట్లాడుతూ.. దివాన సినిమాకి అందరూ సపోర్ట్ చేశారు.

‘రోమియో జూలియట్’కు మీ సపోర్ట్ కావాలని కోరుతున్నాను. మా సినిమా గ్లింప్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా ప్రభాస్ గారికి ధన్యవాదాలు. ఆయన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం మా అందరికీ ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ‘రోమియో జూలియట్’ కూడా కచ్చితంగా ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. డైరెక్టర్ భార్గవ్ మాచర్ల మాట్లాడుతూ.. ‘ఇది అందరి బయోపిక్. మనందరి జీవితంలో ఎక్కడో ఒకచోట కనెక్ట్ అయ్యే ఎమోషన్ను తీసుకుని సినిమాగా చేయడం జరిగింది’ అన్నారు.

ఈటీవీ విన్ వైస్ ప్రెసిడెంట్ సాయికృష్ణ మాట్లాడుతూ..  మేము నిర్మించని సినిమా కాకుండా బయట సినిమాని  ఫస్ట్ టైం ప్రజెంట్ చేస్తున్నాం . ఇది మాకు చాలా స్పెషల్. అలాగే మయూరి మూవీస్ ద్వారా ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తున్నాం. ఇది యూత్ఫుల్ మూవీ. చాలా రిలేటబుల్గా, ఫన్గా ఉంటుంది అన్నారు. హీరోయిన్ విశాఖ ధిమాన్ మాట్లాడుతూ.. ‘నాకు ఈ అవకాశం ఇచ్చిన మా దర్శక నిర్మాతలకు థాంక్యూ. నవంబర్ 13న రిలీజ్ అవుతుంది. అదే రోజు నా బర్త్‌డే. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.’ అన్నారు. ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ భరణ్, వైవా హర్ష మాట్లాడారు.

మరిన్ని వార్తలు