‘సింగ’ లుక్ అదిరింది

25-10-2026 | 05:10am

గోపీచంద్ హీరోగా నటిస్తున్న ‘సింగ’ చిత్రం('Singa' film) నుంచి గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో గోపీచంద్ లుక్ అదిరింది. ప్రత్యేక అవతారంలో ఆయన కనిపిస్తున్నారు. మిస్టీరియస్ అడవిలోని ఓ రాతి గుట్టపై నిలబడి, డార్క్ బ్లూ సంప్రదాయ దుస్తుల్లో, రఫ్ లుక్‌తో కనిపిస్తున్న గోపీచంద్.. పాత్రలోని ఇంటెన్స్ ప్రజెంట్ చేస్తున్నారు. ఆయన చేతిలో ఉన్న భారీ, ప్రత్యేకమైన డిజైన్‌తో రూపొందించిన ఆయుధం పాత్రను మరింత పవర్ ఫుల్‌గా చూపిస్తోంది.

ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వి. వెంకట్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. మలయాళ నటి అనార్కలి నాజర్ ఈ చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమవుతున్నారు.

సినిమా చిత్రీకరణ 50 శాతం పూర్తయింది. అద్భుతమైన ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ స్పెషల్ సెట్స్ను నిర్మించి, కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తర్వాతి షెడ్యూల్ కోసం మరింత భారీ సెట్లను నిర్మిస్తున్నారు. డిసెంబర్ నుంచి ఈ షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు