పీస్ బాండ్‌పై సంతకం చేయను
- ఆ నోటీసులపై సైన్ చేసే ప్రసక్తే లేదు
- ఐసా అధ్యక్షురాలు నేహా బోరా
- ఈనెల 29 వరకు విచారణ వాయిదా వేసిన ఎస్ఈఎం
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 24: ఢిల్లీ పోలీసులు జారీచేసిన పీస్ బాండ్ నోటీసుల(Peace Bond Notice)పై తాను సంతకం చేయబోనని ఐసా జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా(AISA President Neha Bora) స్పష్టం చేశారు. ‘మాకు ఎలాంటి షరతులు లేవు. మేము ఆ ఒప్పందంపై సంతకం చేయబోం’ అని ఆమె పునరుద్ఘాటిం చారు. ప్రజా స్వామ్య అసమ్మతిని అణచివేయడానికే శాంతి ఒప్పంద విచారణల అస్త్రాలను ప్రయోగిస్తున్నారని బోరా ఆరోపించారు. నినాదాలు చేయ డం లేదా సంస్థలను ప్రశ్నించడం శాంతిభంగం కిందకు రాదని ఆమె స్పష్టం చేశారు.
తాను ఈ విచారణలను సవాలు చేస్తూనే ఉంటానని బోరా తేల్చిచెప్పారు. ఒక పూచీకత్తుతో రూ.10,000 ‘శాంతి బంధం‘పై సంతకం చేయాలని ఆదేశిస్తూ పోలీసులు జారీ చేసిన నోటీసును సవాలు చేస్తూ ఐసా అధ్యక్షురాలు నేహా బో రా దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు ఆమె శనివారం మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లోని ప్రత్యేక కార్యనిర్వాహక మేజిస్ట్రేట్ (ఎస్ఈఎం) ముందు హాజరయ్యా రు.
ఈనెల 29లోగా సమాధానం ఇవ్వడానికి ఆమెకు సమయం ఇచ్చారు. బీఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 126 కింద ఈ నెల 17న పోలీసులు నేహా బోరాకు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసు అస్పష్టంగా, వాస్తవాలకు విరుద్ధంగా ఉందని, శాంతిభంగం జరిగే అవకాశం ఉందని సూచించే ఆధారాలు ఏవీ లేవని పేర్కొంటూ, బోరా దానిని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్ర యించారు.
శనివారం ఎస్ఈఎంలో విచారణ సందర్భంగా, జాతీయ జెండాను ఎగురవేయడానికి పౌరులకు అనుమతి అవసరం లేదని ఆమె న్యాయవాది అభిక్ చిమ్నీ వాదించారు. బోరా అనుమతి లేకుండా జాతీయ జెండాను ఎగురవేశారని పోలీసులు ఆరోపించారు.
పోలీసులు చేసిన ఆరోపణకు ఆధారమైన పత్రాలను మేజిస్ట్రేట్ బోరా న్యాయవాదికి అందించారని, 29లోగా సమాధానం ఇవ్వడానికి ఆమెకు సమయం ఇచ్చారని ఆమె న్యాయవాది అభిక్ చిమ్నీ తెలిపారు. అంతకుముందు నేహా బోరా మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 19(1)(ఎ), 19(1)(బి), 21లను ఉల్లంఘిస్తూ, శాంతియుత నిరసనను అణచివేయడానికే ఈ శాంతి బాండ్ చర్య అని ఆరోపించారు. శాంతియుత నిరసనలు ప్రజాస్వామ్య హక్కు అన్నారు.