దీపావళికి ‘నాన్న కుట్టి’

12-10-2026 | 05:25am

ప్రత్యేకమైన కథ, కథనంతో ఆకట్టుకునే విజయ్ ఆంటోని(Vijay Antony) ప్రస్తుతం నాన్న కుట్టి(Nanna Kutti) అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తండ్రి కూతురు సెంటిమెంట్‌తో మారన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ(Vijay Antony) హీరోగా చేస్తున్న చిత్రం ఇది. యాక్షన్, కుటుంబ భావోద్వేగాలు, ఇంటెన్స్ డ్రామాగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ మీద మీరా విజయ్ ఆంటోని నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ మూవీకి సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ అధినేత రామంజనేయులు జవ్వాజీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  దీపావళి సందర్భంగా నవంబర్ 6న విడుదల చేయబోతోన్నారు. దీపావళి సెలవులు కలిసి వచ్చేలా ఈ మూవీ రిలీజ్ని ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది.

ఈ చిత్రంలో ప్రీతి అస్రాని, లిథన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, అరువి మధన్, చిత్ర లక్ష్మణన్, శ్రీజ రవి, వెట్టై ముత్తుకుమార్, జెన్సన్ దివాకర్, మురుగానందం, మున్నార్ రమేష్, లిస్సీ ఆంటోని, కుమార్ నటరాజన్, విజయన్, ప్రవీణ, హరిత, హరిప్రియ ముఖ్య పాత్రల్ని పోషించారు.

మరిన్ని వార్తలు