ఘనంగా అన్నప్రసాద వితరణ
వెంకటాపూర్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం(Sri Sita Ramanjaneya Swamy Temple)లో మంగళవారం గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జోహార్ ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ హమీదా ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మామిడిశెట్టి సుగుణ ముఖ్యఅతిథిగా పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సుగుణ మాట్లాడుతూ.. గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయమని, అన్నదానం మహాదానమని, భక్తులకు అన్నప్రసాదం అందించడం ద్వారా ఆధ్యాత్మికతతో పాటు సేవాభావాన్ని చాటుతున్నారని అన్నారు. విద్యార్థుల్లో సేవా భావం, ఆధ్యాత్మిక చింతన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్ ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షుడు కోటి, గణేష్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.