ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

12-10-2026 | 10:03pm

జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు

ములుగు,(విజయక్రాంతి): ప్రజావాణి(Prajavani)లో అందిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు(Additional Collector Sampath Rao) అధికారులను ఆదేశించారు. సోమవారం నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఆయన దరఖాస్తులను స్వీకరించారు.

భూ సమస్యలకు సంబంధించి 05, ఇందిరమ్మ ఇళ్లకు 01, పింఛన్లకు 1, ఉద్యోగాలకు 2, ఇతర శాఖలకు సంబంధించి 5, మొత్తం 14 దరఖాస్తులు అందాయి. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజావాణిలో అందిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు