పోస్ట్ కార్డుల ద్వారా మండల సమస్యలు పరిష్కరించాలని వినతి

12-10-2026 | 10:41pm

గుండాల,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రధాన సమస్యలను పరిష్కరించాలని నవచైతన్య యువజన సంఘం యూత్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు పోస్ట్ కార్డుల ద్వారా సోమవారం వినతులను పోస్ట్ బాక్స్(Post box) లో వేసి పంపించారు. అనంతరం సంఘ సభ్యులు మాట్లాడుతూ..ప్రజాప్రతినిధులు స్పందించి మండలంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆజాద్, వినయ్, ముఖేష్, సంతోష్, వినయ్, శోభన్, ప్రతాప్, రోషన్, రవివర్మ, రాజేష్, చరణ్, దుష్యంత్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు