దోమకొండలో కంటి పరీక్షల శిబిరం నిర్వహణ

12-10-2026 | 10:44pm

దోమకొండ,(విజయక్రాంతి): దోమకొండ(Domakonda)లో కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో కంటిశుక్లం (క్యాటరాక్ట్), దృష్టి లోపాలను గుర్తించేందుకు పరీక్షలు నిర్వహించారు. ఆటో రిఫ్రాక్టోమీటర్ పరికరం(Auto-refractometer device) ద్వారా కంటి చూపును పరీక్షించి, దృష్టి లోపాలు ఉన్నవారికి తగిన కళ్లద్దాలను సూచించారు.ఈ కార్యక్రమాన్ని దోమకొండ నేత్ర వైద్య అధికారి రవీందర్ పటేల్(Ophthalmic Medical Officer Ravinder Patel) నిర్వహించారు. కంటి సమస్యలను ముందుగానే గుర్తించి, అవసరమైన చికిత్స పొందడం ద్వారా చూపును కాపాడుకోవచ్చని ఈ శిబిరం ద్వారా అవగాహన కల్పించారు.

మరిన్ని వార్తలు