బతుకమ్మ వేడుకలు

12-10-2026 | 10:32pm

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రం లోని వశిష్ఠ డిగ్రీ, జూనియర్ కళాశాల(Junior College)లో సోమవారం బతుకమ్మ వేడుకలు(Bathukamma Celebrations) ఘనంగా నిర్వహించారు. విభిన్న రకాల పూలతో బతుకమ్మలను కూర్చారు. విద్యార్థినిలు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ లయబద్దంగా చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వశిష్ఠ విద్యా సంస్థల డైరెక్టర్ వి.సత్యనారాయణ గౌడ్, సెక్రెటరీ సరోత్తం రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అఖిలేష్ కుమార్ సింగ్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మహేశ్, అధ్యాపకులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు