ప్రజావాణి వినతులకు సత్వర పరిష్కారం చూపాలి

12-10-2026 | 10:46pm

ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి 

జిల్లా జాయింట్ కలెక్టర్ డి.వేణుగోపాల్

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజల నుంచి స్వీకరించే ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డి వేణుగోపాల్(Joint Collector D. Venugopal) సంబంధిత అధికారులకు ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం(Prajavani program)లో డిఆర్ఓ పద్మావతి, ఉపాధి కల్పన అధికారి శ్రీరామ్, హౌసింగ్ పిడి సవేరామ్ తో కలిసి ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. భూ సంబంధిత సమస్యలు, రెవెన్యూ అంశాలు, సంక్షేమ పథకాలు(Welfare Schemes), ఉపాధి, పింఛన్లు, గృహాలు, మౌలిక వసతులు, సామాజిక భద్రత తదితర సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమం ముఖ్యమైన వేదికగా నిలుస్తోందన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి దరఖాస్తును అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు