మున్సిపాలిటీ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

16-10-2026 | 08:43pm

ములుగు, అక్టోబర్ 16 (విజయక్రాంతి) : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, మున్సిపల్ కమిషనర్(Municipal Commissioner) ఆధ్వర్యంలో శుక్రవారం ములుగు మునిసిపల్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు(Bathukamma Celebrations) నిర్వహించుకున్నారు. ఈ వేడుకలకు మున్సిపల్ చైర్ పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, వైస్ చైర్ పర్సన్ ఆసియా షాహీన్, వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు హాజరై, మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి వేడుకలను విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని, మహిళలందరూ ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు