జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన సాత్విక శ్రీని
వెంకటాపూర్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): మండలంలోని లక్ష్మీదేవిపేట గ్రామానికి చెందిన మద్దెల సురేష్, సంధ్య దంపతుల కుమార్తె సాత్విక శ్రీని జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు(national-level kabaddi competitions) ఎంపికైంది. చిట్యాలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆమె కబడ్డీలో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించింది.
ఈ నెల 12, 13 తేదీల్లో సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన అండర్-19 జూనియర్ కళాశాల కబడ్డీ ఛాంపియన్‌షిప్ రాష్ట్రస్థాయి పోటీల్లో సాత్విక శ్రీని పాల్గొంది. ఈ పోటీల్లో వరంగల్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించి తన ప్రతిభను చాటుకుంది. దీంతో జాతీయస్థాయి పోటీల్లో ఆడే అవకాశం దక్కించుకుంది. సాత్విక శ్రీని జాతీయస్థాయికి ఎంపిక కావడంపై కళాశాల ప్రిన్సిపాల్ గొల్కొండ బిక్షపతి, వైస్ ప్రిన్సిపాల్ మాలతి లత, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ శారద, ఫిజికల్ డైరెక్టర్ వెన్నెల, పీఈటీ శారదతో పాటు ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు.