లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి

06-11-2026 | 08:24pm

వెంకటాపూర్, నవంబర్ 06 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్(Laxman Goud) కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం(Government job) కల్పించాలని ఉద్యమకారుల ఫోరం ములుగు జిల్లా(Activists Forum, Mulugu District) ప్రధాన కార్యదర్శి చంటి భద్రయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల సాయంతో సరిపెట్టకుండా పిల్లల చదువుల బాధ్యతను కూడా తీసుకోవాలని, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ప్రత్యేక ఆన్‌లైన్ వెబ్‌సైట్ ప్రారంభించి దరఖాస్తులు స్వీకరించాలని కోరారు. లేనిపక్షంలో అసెంబ్లీ ముట్టడి చేపడతామని హెచ్చరించారు. ఉద్యమకారులు ఆత్మహత్యలకు పాల్పడకుండా మనోధైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు