మీకు తెలుసా.. సముద్రంలో విమానాలు మాయం
సముద్రం ప్రశాంతంగా కనిపిస్తుంది.. కానీ ఆ ప్రాంతంలోకి వెళ్లిన నౌకలు(Ships,), విమానాలు(Airplanes) ఏమయ్యాయో ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే! అదే ప్రపంచాన్ని దశాబ్దాలుగా ఆశ్చర్యపరుస్తున్న బెర్ముడా ట్రయాంగిల్(Bermuda Triangle)!
అట్లాంటిక్ మహాసముద్రం(Atlantic Ocean)లో బెర్ముడా, ఫ్లోరిడా, ప్యూర్టో రికో మధ్య విస్తరించిన ఈ ప్రాంతం ఎన్నో వింత కథలకు కేంద్రంగా మారింది. ఇక్కడ ప్రయాణించిన కొన్ని నౌకలు, విమానాలు అదృశ్యమయ్యాయనే కథనాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అసలు ఈ ప్రాంతంలో ఏదైనా తెలియని శక్తి ఉందా? సముద్ర గర్భంలో దాగి ఉన్న రహస్యాలే ఈ అదృశ్యాలకు కారణమా? లేక ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులు, మానవ తప్పిదాలే అసలు కారణమా?
శాస్త్రవేత్తలు మాత్రం బెర్ముడా ట్రయాంగిల్లో అసాధారణమైన అతీంద్రియ శక్తులు ఉన్నాయనే వాదనలకు ఆధారాలు లేవని చెబుతున్నారు. మిస్టరీనా? మూఢనమ్మకమా? ఏదేమైనా బెర్ముడా ట్రయాంగిల్ పేరు వినగానే నేటికీ ప్రపంచానికి ఎన్నో ప్రశ్నలు గుర్తుకొస్తాయి!