క్రీడలతో మానసిక ఉల్లాసం
వెంకటాపురం నూగూరు అక్టోబర్ 11 విజయక్రాంతి : వెంకటాపురం మండలంలో(Venkatapuram Mandal) కాఫెడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న వెంకటాపురం ప్రీమియర్ లీగ్ సీజన్(Venkatapuram Premier League Season) 03 ప్రారంభించిన వెంకటాపురం సీఐ ముత్యం రమేష్(CI Mutyam Ramesh). సీఐ ముత్యం రమేష్ మాట్లాడుతూ క్రీడలు(Sports) వ్యక్తిలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు దోహదపడతాయని, క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు.. యువత ఎవరు చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడలు దోహదపడతాయని అన్నారు.
ఈ క్రీడల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 55,555 రూపాయలు, ద్వితీయ బహుమతి 33,333 రూపాయలు, తృతీయ బహుమతి 22,222 రూపాయలు, నాలుగో బహుమతిగా 11,111 వేల రూపాయలు అందజేయనున్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సై కొప్పుల తిరుపతిరావు, వెంకటాపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచి సరస్వతి, పిఎసిఎస్ చైర్మన్ చెడేం మోహన్ రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్, మన్యం సునీల్ బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గంప రాంబాబు ముడుంబా శ్రీను తదితరులు పాల్గొన్నారు.