వాజేడులో ఇసుక లారీల రచ్చ

25-10-2026 | 10:34am

ఇసుక ర్యాంపు లారీల దుమ్ముతో ఇబ్బంది పడుతున్న ప్రజలు

దుమ్ముతో వాహనాలు కనిపించని పరిస్థితి

భారీ ప్రమాదాలు జరిగే అవకాశం

వాజేడు అక్టోబర్ 25 (విజయక్రాంతి) : ములుగు జిల్లా వాజేడు మండలం(Wajedu Residents) లోని ప్రజలు ఇసుక ర్యాంపుకు వచ్చే అధిక లారీలతో  అవస్థలకు పడుతున్నారు అధిక స్పీడ్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తున్న లారీ డ్రైవర్లు రాచకాలకు మండలంలోని ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. చెరుకూరు నుంచి జగన్నాధపురం వరకు 163వ జాతీయ రహదారి నిర్మాణంలో ఉండటం లారీలు అధిక సంఖ్యలో రాంపులకు రావడంతో దుమ్ము లేచి వెనకనుంచి వచ్చే వాహనాలు కూడా కనిపించని పరిస్థిత నెలకొందని ఇదే ఇలా  కొనసాగితే ప్రమాదాలు పెద్ద మొత్తంలో ప్రాణ నష్టాలు జరిగే ప్రమాదం ఉందని ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.

అంతేకాకుండా రహదారి ప్రక్కన నివసిస్తున్న ప్రజలు దుమ్ము దూలికి గురి అయి అనారోగ్యానికి గురి అవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుపై దుమ్ము లేవకుండా ప్రత్యామ్నాయ మార్గాలని ఏర్పాటు చేయాలని లేని పక్షంలో రోడ్డుపై బటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ప్రజలు అంటున్నారు వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు