డిండి లిఫ్ట్‌ను రద్దు చేయాలి

25-10-2026 | 05:25am
  1. ప్రత్యామ్నాలుండగా ‘పాలమూరు లింకెందుకు?
  2. బీజేపీ ఎంపీ డీకే అరుణ 

హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాం తి): పాలమూరు ప్రజల ఆశీర్వాదంతో సీ ఎం పీఠమెక్కిన రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy).. ఇప్పుడు అదే జిల్లా రైతాంగానికి అన్యాయం చేస్తున్నారని బీజేపీ ఎంపీ, తమిళనాడు రాష్ట్ర సహ ఇన్‌చార్జి డీకే అరుణ(State Co-Incharge DK Aruna) మండిపడ్డారు. నాడు కేసీఆర్ పాలమూ రు మెడకు వేసిన ‘డిండి ఉరితాడు’ను నేడు రేవంత్‌రెడ్డి మరింత బిగిస్తున్నారని విమర్శించారు.

సాగునీటి ప్రాజెక్టుల పేరుతో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రయోజనాలను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తా రు. నీటిపారుదల శాఖపై ఇరిగేషన్ మంత్రితో కలిసి సీఎం నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే.. పాలమూరు రైతుల ప్రయోజనాలపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతోందని ఆరోపించారు. హైదరాబాద్‌లోని భీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు ఆశీర్వదించి గెలిపించడం వల్లే నేడు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారన్న వాస్తవాన్ని ఆయనగుర్తుంచుకోవాలనానరు.

ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని రైతులతో పాటు, యావత్ పాలమూరు రైతాంగానికి ప్రభుత్వం ద్రోహం చేసేలా వ్యవహరించడం శో చనీయమన్నారు.  2015లో నాటి ముఖ్యమం త్రి కేసీఆర్ ఇంజినీర్ల నివేదికలను తుంగలో తొ క్కి, ప్రాజెక్టు అప్రోచ్‌ను జూరాల నుంచి నార్లాపూర్ శ్రీశైలం బ్యాక్ వాటర్‌కు మార్చారని ఆరో పించారు. కేసీఆర్ నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకించినా వినిపించుకోకుండా డిజైన్లనే మార్చేశారని ఆరోపించారు.

అనంతరం ఏకం గా జీవో 105, 107లను తెచ్చి డిండి ఎత్తిపోత ల కోసం పాలమూరుెేరంగారెడ్డి ప్రాజెక్టు ద్వా రా రోజుకు 0.5 టీఎంసీ తరలించే కుట్ర చేశారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి డిండి ప్రాజెక్టును మళ్లీ తెరపైకి తెచ్చి పాలమూరుకు దగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పాలమూరు హక్కులు హరిస్తారా?

నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు ఫ్లోరైడ్ ప్రాంతాల సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయంగా పుట్టగండి లిఫ్ట్, ఎస్‌ఎల్బీసీ, నక్కలగండి ప్రాజెక్టులు ఉన్నాయని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. వాటి ద్వారా నీటిని తరలించడంలో ఎవరికీ అభ్యంతరం లేదని ఆమె స్పష్టం చేశారు. కానీ పాలమూరు ప్రాజెక్టుతో ఎలాంటి సంబంధం లేని డిండి లిఫ్ట్‌ను అనుసందానం చేస్తూ, ఏదుల రిజర్వాయర్ నుంచి పైప్‌లైన్లు వేసి నీటిని తరలిస్తామ నడం పాలమూరు జిల్లా రైతుల హక్కులను హరించడమేనని మండిపడ్డారు.

శ్రీశైలం జలాలపై పాలమూరు రైతులకే తొలి హక్కు ఉందని డీకే అరుణ స్పష్టం చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి అదనంగా 0.6 టీఎంసీ కాదు కదా.. ఒకటిరెండు టీఎంసీలు తోడే సామర్థ్యం ఉన్నా.. ఆ నీటినంతా మహబూబ్‌నగర్ జిల్లాకే కేటాయించాలని డిమాండ్ చేశారు. డిండి ప్రా జెక్టు కాల్వల వల్ల దాదాపు 60 కిలోమీటర్ల మే ర పాలమూరు భూములు, 30కి పైగా గ్రామాలకు ముంపు పొంచి ఉందని, అయినా ఇక్కడి మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.

నల్లగొండ జిల్లా నేతలు తమ ప్రాంత ప్రయోజనా ల కోసం ఏకమవుతుంటే పాలమూరు ప్రతినిధులు స్వప్రయోజనాల కోసం జిల్లా హక్కుల ను తాకట్టు పెడతారా? అని నిలదీశారు. ఇప్పటికైనా పాలమూరు- జూరాల నుంచి ప్రారంభించేలా నాటి డీపీఆర్‌ను తిరిగి సమీక్షించాలని, మహబూబర్‌నగర్ పార్లమెం ట్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి నియోజకవర్గానికి సాగునీరు అందించేలా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పాలమూరు రైతాంగ ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తామని హెచ్చరించారు. పదవి ఎవరికీ శాశ్వతం కాదని రేవంత్ గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు