బసప్ప క్యాంపులో అన్నదానం

18-10-2026 | 03:25pm

బూర్గంపాడు, (విజయక్రాంతి): దసరా మహోత్సవాల(Dasara festivities)ను పురస్కరించుకుని సారపాక బసప్ప క్యాంపులో ఆదివారం భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ముఖ్య అతిథులు అన్నదానాన్ని ప్రారంభించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో బూర్గంపాడు ఎస్సై మేడా ప్రసాద్, కాంగ్రెస్ నాయకుడు ఇంగువ రమేష్, కాంట్రాక్టర్ బసప్ప రమేష్, ఆయన తనయుడు పాకాల భరత్, మూడో వార్డు సభ్యురాలు బాలికనక రత్నం, మాజీ ఎంపీటీసీ బాలి శ్రీహరి, గ్రామ పెద్ద సాల్వేరు రంగయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి సహకరించిన దాతలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు