ఫాగింగ్ యంత్రాల కొనుగోళ్లలో అవినీతి

25-09-2026 | 06:01pm

మార్కెట్లో ఒక ధర, ఎంబిల్లో మరో ధర

బిజినేపల్లి, సెప్టెంబర్ 25 : దోమల నివారణ(Mosquito Control) కోసం మండల వ్యాప్తంగా ఆయా గ్రామ పంచాయతీల్లో(Gram Panchayat) కొత్తగా పాగింగ్ యంత్రాలను(Fogging machines) కొనుగోలు చేశారు. బహిరంగ మార్కెట్లో(Open markets) ఒక్క పాగింగ్ యంత్రం రూ.20వేల నుండి రూ.25వేల (అన్ని ఖర్చులతో కలిపి) వరకు ఉంటే, మండలంలోని ఓ గ్రామ పంచాయతీ ఎంబి రికార్డుల్లో రూ.55000 వేల బిల్లు పెట్టి తమ జేబులు నింపుకున్నారు. మండల వ్యాప్తంగా చాలా గ్రామాల్లో పాగింగ్ యంత్రాలను కొనుగోళ్ళు చేశారు. వీటిపై జిల్లా అధికారులు సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు