బార్‌ అసోసియేషన్‌లో సంపూర్ణ వందేమాతరం ఆలాపన

25-09-2026 | 06:32pm

ఆసిఫాబాద్‌, సెప్టెంబర్‌ 25 (విజయక్రాంతి): ‘నమామి భారతం’ కార్యక్రమంలో('Namami Bharatam' program) భాగంగా కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా బార్‌ అసోసియేషన్‌(Kumuram Bheem Asifabad District Bar Association) ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయవాదులు(Lawyers) సంపూర్ణ వందేమాతరం గీతాన్ని(Vande Mataram Song) ఆలపించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బోనగిరి సతీష్‌బాబు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సతీష్‌బాబు మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో(Freedom Movement) న్యాయవాదులు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.

దేశం తనకు ఏమిచ్చిందనే దానికంటే తాను దేశానికి ఏమి చేయగలననే ఆలోచనతో ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకు సాగాలని, పిల్లల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముక్త సురేష్‌, జగన్‌మోహన్‌రావు, నీకోడే రవీందర్‌, గుండారపు గణపతి, నరహరి, చరణ్‌తేజ, ప్రదీప్‌ సర్కార్‌, ఆకాశ్‌ జాడవ్‌, విద్యాసాగర్‌, చిప్ప అరవింద్‌, గర్నుల్‌ శంకర్‌, ఇగూరపు సంజీవ్‌, నాగరాజు, బంనే రూపేష్‌, కళ్యాణ్‌, ముక్రమ్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు