ఆలయ అభివృద్ధికి సహాయం అందిస్తా
25-09-2026 | 07:48pm
వెల్దండ సెప్టెంబర్ 25: మండల పరిధిలోని అజిలాపూర్ గ్రామాన్ని శుక్రవారం ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రెడ్డి (Aikyata Foundation Chairman Reddy)సందర్శించి గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. గ్రామంలోని ఆలయ అభివృద్ధి కోసం తన వంతు సహాయంగా ఆర్థిక సాయం అందజేస్తానని హామీలు ఇచ్చారు. ఆయన వెంట గ్రామస్తులు ఐక్యత ఫౌండేషన్ సభ్యులు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.