కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి కాయకల్ప అవార్డు

17-10-2026 | 04:22pm

కల్వకుర్తి: అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు ఆసుపత్రిలో పరిశుభ్రతను పాటించినందుకు కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి(Kalwakurthy Government Hospital)కి ప్రభుత్వం కాయకల్ప అవార్డు(Kayakalp Award)ను ప్రకటించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం తెలిపారు.

గత మార్చి నెలలో వైద్య ఆరోగ్యశాఖకు చెందిన బృందం ఆసుపత్రిని సందర్శించి నాణ్యతా ప్రమాణాలు, పరిశుభ్రత, రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించిందని పేర్కొన్నారు. ఈ పరిశీలన అనంతరం ఆసుపత్రిని అవార్డుకు ఎంపిక చేసినట్లు వెల్లడించారు.

రానున్న రోజుల్లోనూ ఆసుపత్రిలో మరింత మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు పొందేందుకు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర ఉద్యోగులందరూ సమన్వయంతో పనిచేస్తారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తుచేశారు.

మరిన్ని వార్తలు