తాళ్లవెల్లంల నైట్‌హాల్ట్ బస్సును పునరుద్ధరించాలి..

13-10-2026 | 07:34pm

బీజేపీ రాష్ట్ర నాయకుడు చికిలం మెట్ల అశోక్ డిమాండ్..

చిట్యాల (విజయక్రాంతి): కరోనా సమయంలో రద్దు చేసిన తాళ్లవెల్లంల నైట్‌హాల్ట్ బస్సును వెంటనే పునరుద్ధరించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు చికిలం మెట్ల అశోక్(Chikkilam Metla Ashok) మంగళవారం డిమాండ్ చేశారు. ఈ బస్సు చిట్యాల మండలంలోని 13 గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదని తెలిపారు. ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, ఆసుపత్రులకు వెళ్లే మహిళలు బస్సు లేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రైవేటు వాహనాలకు అధిక చార్జీలు చెల్లించాల్సి వస్తోందని పేర్కొన్నారు. నల్గొండ ఆర్టీసీ ఆర్ఎం, నార్కెట్‌పల్లి డిపో మేనేజర్ స్పందించి బస్సును పునరుద్ధరించాలని, లేనిపక్షంలో ప్రజలతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు