ఇండ్లు లేని పేదలు ఉండొద్దు

17-10-2026 | 10:03pm

ఎమ్మెల్సీ శంకర్ నాయక్ 

దామరచర్ల :అక్టోబర్ :17: తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదకు సొంతిల్లు నిర్మించడమే  కాంగ్రెస్ ప్రభుత్వ(Congress government) ధ్యేయమని శాసన మండలి సభ్యులు కేతవాత్ శంకర్ నాయక్(Ketawat Shankar Naik) అన్నారు.శనివారం దామరచర్ల మండలం(Damaracherla Mandal) నూనావత్ తండాలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) సారాధ్యంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో ప్రతి పేదకు సొంత ఇల్లు గల  రాష్ట్రంగా  తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు.

ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కలను సహకారం చేసేందుకే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చామని పేర్కొన్నారు. సొంత ఇల్లు ప్రతి కుటుంబానికి భద్రతను ఆత్మగౌరవాన్ని ఇస్తుందని చెప్పారు.ఈ సందర్భంగా నూతన గృహప్రవేశం చేసిన నూనావత్ రామచంద్రు శారదా దంపతులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సైదా నాయక్, వెంకన్న, బాలు, బాబు, రాము, బాలు ధర్మ, ఉపేందర్, మేఘ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు