మాగనూరు పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా కే మహేందర్ రెడ్డి
మాగనూరు, అక్టోబర్ 23: నారాయణపేట జిల్లా మాగనూరు పోలీస్ స్టేషన్((Maganoor Police Station) నూతన ఎస్సైగా మహేందర్ రెడ్డి(Mahender Reddy) శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్సై మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలు పరిరక్షణకు(Maintenance of law and order) ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రజలకు పోలీసులపై నమ్మకం మరింత పెరిగేలా బాధ్యతగా విధులు నిర్వహిస్తామన్నారు.
ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఫిర్యాదులపై చట్టం ప్రకారం వేగంగా స్పందిస్తామని అన్నారు. నేరం నియంత్రణ అసంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు అన్నారు. ముఖ్యంగా యువత మాదకద్రవ్యాలు ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్న పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించి సహకరించాలన్నారు. ఇంతకుముందు గద్వాల జిల్లా కేంద్రంలో పనిచేస్తూ మాగనూరు పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది అన్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ అశోక్ బాబు గద్వాల ఎస్పీ కార్యాలయంకు బదిలీ అయినట్లు వారు తెలిపారు.