బీసీ కాలనీలో 33 కేవీ విద్యుత్తు తీగలను తొలగించాలి

02-11-2026 | 08:25pm

మాగనూరు, నవంబర్ 2. మాగనూరు మండల కేంద్రంలోని(Maganur Mandal Headquarters) ఎస్సీ బీసీ కాలనీలో 33 కెవి విద్యుత్తు తీగలను తొలగించాలని కాలనీవాసులు సోమవారం ప్రజావాణిలో ఎంపీ ఓ కళ్యాణి(MP O. Kalyani at 'Praja Vani') గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. గతంలో ఇంటి స్థలాలను నిరుపేద కుటుంబాలకు ఇల్లు నిర్మించుకోవటం కేటాయించిన స్థలములు 33 కెవి విద్యుల్లైన్లు ఉండడం మూలంగా లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోక పోతున్నామని విద్యుత్ తీగలు ఉండడం వల్ల  ఇంటి ని నిర్మించుకొనుటకు చాలా ఇబ్బందులు ఏర్పడుతుందన్నారు. 

ప్రభుత్వ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, స్పందించి 33 కెవి విద్యుత్తు తీగలను తొలగించి ఇంటి నిర్మాణ పనులకు సహకరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో ఉప సర్పంచ్ పెద్దింటి రాజు, పుంజనూరు ఆంజనేయులు, చాకలి వెంకటేష్, పరుశురాం, జింగిటి వాపయ్య, కాలనీవాసులు తదితరులు.

మరిన్ని వార్తలు