అమెరికా–చైనా సంబంధాల్లో కీలక ఘట్టం
వాషింగ్టన్: అమెరికా, చైనా మధ్య దెబ్బతిన్న సంబంధాలను చక్కదిద్దే ప్రయత్నాల్లో భాగంగా ఇరు దేశాల అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), జిన్‌పింగ్(Chinese President Xi Jinping) బుధవారం వాషింగ్టన్‌లో భేటీ కానున్నారు. సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు జిన్‌పింగ్ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన దాదాపు 11 ఏళ్ల తర్వాత చైనా అధ్యక్షుడి అమెరికాను విజిట్ కావడం ప్రత్యేకత సంతరించుకుంది. ఈ సమావేశం వాణిజ్యం, సుంకాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence), అరుదైన ఖనిజాలు, తైవాన్, ఇరాన్, ఫెంటానిల్ నియంత్రణ వంటి కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది.
ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య నెలకొన్న పోటీ, వాణిజ్య ఆంక్షలు, సాంకేతిక పరిమితుల నేపథ్యంలో ఈ చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది. అమెరికా–చైనా(US-China) మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించడం కూడా భేటీలో ప్రధాన అంశంగా ఉండనుంది. చైనా ఈ సమావేశాన్ని ద్వైపాక్షిక సంబంధాల్లో ముఖ్యమైన ఘట్టంగా అభివర్ణించింది. అయితే, తైవాన్, వాణిజ్యం, టెక్నాలజీ, ఇరాన్ వంటి అంశాల్లో ఇరు దేశాల మధ్య విభేదాలు ఇంకా కొనసాగుతున్న తరణంలో ట్రంప్–జిన్‌పింగ్ భేటీ(Trump-Jinping Meeting) నుంచి ఎలాంటి కీలక నిర్ణయాలు వెలువడతాయన్నది అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.