UPI ఛార్జీల వివాదంపై రాహుల్ విమర్శలు! స్పందించిన గొగోయ్, తివారీ
ప్రభుత్వ పార్లమెంటరీ కమిటీ వాదనలపై కాంగ్రెస్ స్పందన
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా యూపీఐపై చర్చ జరుగుతోంది. UPI(Unified Payments Interface) లావాదేవీలపై రుసుము విధించే నిర్ణయానికి పార్లమెంటరీ ఆర్థిక వ్యవహారాల స్థాయీ సంఘంలోని తమ ఎంపీలు మద్దతు తెలిపారన్న వాదనలను కాంగ్రెస్(Congress) గురువారం తోసిపుచ్చింది. యూపీఐ పన్ను' నిర్ణయంపై వ్యక్తమైన తీవ్ర వ్యతిరేకత నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రభుత్వ పార్లమెంటరీ కమిటీ వాదనలపై కాంగ్రెస్ స్పందించింది.
రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన వ్యాపారుల UPI చెల్లింపులపై రుసుము విధించే నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Congress leader Rahul Gandhi) విమర్శించడం వెనుక ఉన్న ఔచిత్యాన్ని ప్రభుత్వం ప్రశ్నించిన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ ఈ వ్యాఖ్యలు చేసింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ(Parliamentary Standing Committee) అటువంటి చర్యకు ఆమోదం తెలిపిందని, ఆ కమిటీలోని కాంగ్రెస్ సభ్యులు కూడా దానికి మద్దతు ఇచ్చారని ప్రభుత్వం పేర్కొంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) కోసం శ్రేణీకృత మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR)/రెవెన్యూ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ ఆర్థిక స్థాయీ సంఘం ఒత్తిడి చేసిందని, దానిని ఆలస్యం లేకుండా నోటిఫై చేసి అమలులోకి తీసుకురావాలని కూడా ఆ సంఘం పేర్కొందని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు.
ఆగస్టులో యూపీఐ ద్వారా జరిగే కొన్ని వ్యాపార లావాదేవీలపై ఛార్జీలు విధించాలని పార్లమెంటరీ ప్యానెల్ ఒత్తిడి చేసినప్పుడు కాంగ్రెస్ ఎంపీలు(Congress MPs) వ్యతిరేకించలేదన్న ఆరోపణను తిప్పికొడుతూ, ఆ సమావేశానికి హాజరైన గౌరవ్ గోగోయ్, "వారు ఫైనాన్స్ కమిటీ సభ్యులను కలిసినప్పుడు యూపీఐ పన్నుపై ఎలాంటి నిర్దిష్ట ప్రతిపాదన లేదు" అని అన్నారు. ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు గౌరవ్ గోగోయ్, పి చిదంబరం, మనీష్ తివారీ, కిషోరీ లాల్ మరియు కె గోపీనాథ్ - ఆగస్టులో పార్లమెంటరీ ఆర్థిక స్థాయీ సంఘానికి హాజరయ్యారు.