జ్ఞానాన్ని పంచుతాం
- మతమార్పిడికి ప్రయత్నించలే
- భారత్ శాంతి, శ్రేయస్సుకు మార్గం చూపిస్తుంది
- ముంబై సదస్సులో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
ముంబై, అక్టోబర్ 2: ఇతర దేశాలను జయించడానికో, ప్రజలను మతమార్పిడి(Religious conversion) చేయడానికో భారత్ ప్రయత్నించడం లేదని, తమ జ్ఞానాన్ని ప్రపంచంతో పంచుకుంటుందని, శాంతి, శ్రేయస్సుకు మార్గం చూపిస్తుం దని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్(RSS Chief Mohan Bhagwat) అన్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ముంబైలో శుక్రవారం జరిగిన ఆల్ ఇండియా విహార్ సేవా(All India Vihar Seva) గ్రూప్ 14వ సదస్సులో భగవత్ ప్రసంగించారు.
అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ(Environmental Protection), వ్యక్తిగత స్వేచ్ఛ, కుటుంబ జీవితం మధ్య సమతుల్యత కోసం ప్రపంచ దేశాలు సతమ తం అవుతున్నాయని, వాటికి దిశా నిర్దేశం చేసే శక్తి భారత్కు మాత్రమే ఉందని అన్నా రు. వ్యక్తిగత స్వేచ్ఛ పెరిగే కొద్దీ కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని, ఒకదాన్ని వదులుకొని మరోదాన్ని ఎంచుకోవడం తో సంఘ ర్షణలను పరిష్కరించలేమన్నారు. వేదాలు, ఉపనిషత్తులు జ్ఞాన సంపన్నుల బోధనల నుంచి వచ్చిన జ్ఞానం ప్రపంచానికి చాలా అవసరమన్నారు.