అందరినీ రక్షించాలనే పోరాడా

03-10-2026 | 05:25am
  1. కష్టాల్లో హనుమాన్ చాలిసా చదివా
  2. వీడియో కాల్‌లో పరామర్శించిన ప్రధాని మోదీకి వివరించిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ 
  3. మీరు మహాత్మాగాంధీ ‘అహింస’ను ప్రపంచానికి చాటారు
  4. మీతో మాట్లాడేందుకు భారత్ ఎదురుచూస్తోంది: మోదీ

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: ‘ఫ్లైదుబాయ్ విమానం(flydubai aircraft) (ఎఫ్‌జెడ్1073)లో తన సహ-పైలట్ దాడికి గురైనప్పటికీ, ఇతరుల ప్రాణాలు పోనివ్వకూడదనే దృఢంగా సంకల్పించాను. మరణంతో పోరాడుతున్నా.. తనలో మిగిలి ఉన్న శక్తినంతా కూడకట్టుకుని కాక్‌పిట్‌ను తెరిచాను. ఇద్దరి ప్రయాణికుల సహాయంతో విమానాన్ని సురక్షితంగా కాపాడుకోగలిగాను. ఆ కష్టసమయాల్లో హనుమాన్ చాలిసా తనకు తోడుగా నిలిచింది’ అని భారతీయ సంతతికి చెందిన ఫ్లైదుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్(flydubai Captain Smith Matcher) శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి(Narendra Modi) వివరించారు.

మృత్యువు వెంటాడుతున్నా.. సహసోపేతంగా పోరాడి 174 ప్రయాణికులను కాపాడిన ‘మీరు మహాత్మాగాంధీ(Mahatma Gandhi) నిజమైన అహింస విధానాన్ని నేడు ప్రపంచానికి చాటారని ప్రధాని మోదీ తెలిపారు. ‘మీతో మాట్లాడేందకు భారత్ ఎదురుచూస్తోందని మచ్చర్‌తో అన్నారు. ఈ సందర్భంగా ఇస్రాయెల్(Israel), సౌదీ అరేబియా ప్రభుత్వాలకు మోదీ కృతజ్జతలు తెలిపారు. ప్రస్తుతం యూఏఈలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ పైలట్‌ను ప్రధాని మోదీ వీడియో కాల్ చేసి పరామర్శించారు. బుధవారం జరిగిన ఈ ఘటన గురించి మచ్చర్, ఆ గగనతల ఉత్కంఠ క్షణాలను కెప్టెన్ స్మిత్ మోదీకి వివరించారు.

కష్ట సమయాల్లో తాను హనుమంతుడిని కీర్తించే ‘హనుమాన్ చాలీసా’ను పఠిస్తానని ఆయన చెప్పారు. ‘నేను గాయపడి (కాక్‌పిట్)లో కుప్పకూలాను. నేను నా ప్రాణాలను కాపాడుకోవడానికి పోరాడుతున్నప్పటికీ, అదే సమయంలో ఇతరులను చనిపోనివ్వకూడదని తపించాను. అది చాలా కీలకమైన క్షణం. విమానం కిందకు పడిపోతోందని ఆ సమయంలో నాకు అర్థమైంది. నాకు చాలా గాయాలయ్యాయి. దాడికి గురైనప్పటికీ, నేను లేచి ఏదో ఒకటి చేయాలని నాకు నేనే చెప్పుకున్నాను.

ఆ సమయం లో, కాక్‌పిట్ తలుపు తెరవడానికి నేను శాయశక్తులా ప్రయత్నించాను. ఇందులో ఇతరుల పాత్ర కూడా అంతే కీలకం’ అని ఆయన అన్నారు. పైలట్ ధైర్యాన్ని, క్లిష్ట సమయంలో సమయస్ఫూర్తిని, సంయమనా న్ని ప్రశంసిస్తూ, మచ్చర్ క్షణకాలంలోనే సరైన నిర్ణయం తీసుకుని అనేక మంది ప్రాణాలను కాపాడారని ప్రధాని పేర్కొన్నారు. ‘ఈ ఘటన తర్వాత, భారతీయులు ఇతరుల ప్రాణాలు తీసేవారు కారని, వారిని కాపాడటం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టేవారని దేశం గర్వంగా చెప్పుకోగలదు’ అని మోదీ చెప్పారు.

‘నా హృద యాంతరాల నుంచి గర్వపడుతున్నా’ అని స్పష్టం చేశారు. తనకు కష్టం వచ్చినప్పుడల్లా ‘హనుమాన్ చాలీసా’ పఠిస్తానని మచ్చర్ చెప్పగా, ప్రధాని ప్రశంసించారు. ‘నేను దేశానికి దూరంగా ఉన్నాను కానీ, మన సంస్కృతికి దూరం కాలేదు’ అని మచ్చర్ స్పష్టం చేశారు. ‘భారత్ మీకు స్వాగతం పలకడానికి వేచి ఉంది’ అని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ఆ పైలట్ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రధానమంత్రితో మాట్లాడటం తనకు ఎంతో ప్రత్యేకమైన క్షణమని అన్నారు.

ప్రధాని తనకు అత్యంత ఆదర్శప్రాయు డని, ఆయన నుంచి ఫోన్ రావడం ఎంతో గర్వకారణమని, ఆయనతో మాట్లాడే అవకాశం వస్తుందని తాను ఎప్పుడూ ఊహించలేదని చెప్పారు. మచ్చర్ తల్లి గీతా బెన్ గురిం చి కూడా మోదీ ప్రస్తావిస్తూ.. ఆమె అతన్ని ‘భగవద్గీత’ విలువలు, బోధనలతో పెంచారని తెలిపారు. మచ్చర్‌ను బాగా చూసుకున్నందుకు సౌదీ అరేబియా, యూఏఈ ప్రభుత్వాలకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ‘ఈ రోజు గాంధీ జయంతి. ‘అహింస’ నిజమైన అర్థం ఏమిటో మీరు ప్రపంచానికి చాటి చెప్పారు’ అని మోదీ స్పష్టం చేశారు.

ఆ పైలట్ స్వస్థలం గుజరాత్ కావడంతో, ప్రధాని మచ్చర్‌తో కాసేపు గుజరాతీ భాషలో కూడా మాట్లాడారు. ఇదిలా ఉండగా కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను ‘భారత ధైర్య పుత్రుడు’ అని యూఏఈలోని భారత రాయబారి దీపక్ మిట్టల్ అభివర్ణించారు. ఆయన ‘మానవాళికి అద్భుతమైన సేవ’ చేశారని కొనియాడారు. మచ్చర్ బాగా కోలుకుంటున్నా రని, తన కుటుంబంతో నవ్వుతూ, మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. ఇదాల ఉంటే కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఇంటిపేరుపై అంతా ఆసక్తి నెలకొంది. ఆయన ఇంటిపేరు అచ్చం హిందీలో దోమ అనే పదంలాగే వినిపిస్తుంది. గుజరాత్‌లో మచ్చర్‌ను నామకరణ సంప్రదాయంతో ఒకటి అని జర్నలిస్ట్ షీలా భట్ తెలిపారు.

మచ్చర్‌కు ‘అశోక చక్రం’ ఇవ్వాలి

ఫ్లైదుబాయ్ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్కు అశోక చక్ర పురస్కారం ఇవ్వాలని కోరుతూ రాజ్యసభ ఎంపీ మిలింద్ దేవోరా శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అతని ధైర్యం అనేది యుద్ధభూమికి లేదా ఏదైనా ఒక నిర్దిష్ట వృత్తికి పరిమితం కాదనే శక్తివంతమైన సందేశాన్ని యువతకు అందిస్తుందని అన్నారు. అశోక చక్ర పురస్కారం కోసం మచ్చర్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన ప్రధాని మోదీని కోరారు.

ఫ్లైదుబాయ్‌లో 6 ఏళ్ల చిన్నారి.. అరుపులు విని..

ఫ్లైదుబాయ్‌లో ఆరేళ్ల చిన్నారి నీనా టాయిలెట్‌లో ఉండగా, కాక్‌పిట్ నుం చి అరుపులు విని కేకలు వేసింది. ఆ విమానంలో ముందు వరుసలో కూ ర్చున్న జ్వికా మాన్స్ తన కుమార్తె అ రుపులు విని.. నీనా దగ్గరికి పరుగెత్తా డు. ’నాన్నా, మనం చనిపోవాలనుకోవడం లేదు’ అని అన్న ఆ చిన్నారి మాటలు.. అతన్ని కాక్‌పిట్ వైపు పరుగెత్తి కో-పైలట్‌తో పోరాడుతున్న మచ్చ ర్‌ను చూసి చలించిపోయాడు. తర్వాత మానెస్, మరో ఇద్దరు ప్రయాణికులైన అసఫ్ రాజువాన్, యానివ్ హ యున్.. కోపైలెట్‌తో పోరాడి విమానంలోని హెడ్‌ఫోన్ సెట్ల కేబుళ్లతో అ తడిని కట్టేశారు. ఇది ఒక ‘హారర్ సిని మా’ లాంటిదిగా మాన్స్ వర్ణించారు. 

మరిన్ని వార్తలు