ఢిల్లీలో లెఫ్ట్ స్టూడెంట్ల మెరుపు ధర్నా

12-10-2026 | 05:25am
  1. సీఈసీ జ్ఞానేశ్ రాజీనామాకు డిమాండ్
  2. అట్టుడికిన కన్నాట్ ప్లేస్.. ఈడ్చుకెళ్లిన పోలీసులు
  3. నేడు ఇండీ కూటమి మహా ఆందోళన.. సుప్రీకోర్టు వరకు భారీ ర్యాలీ
  4. సీజేఐని కలిసి వినతిపత్రం ఇవ్వనున్న నేతలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 11:  సీఈసీ జ్ఞానేశ్‌కుమార్(CEC Gyanesh Kumar) రాజీనామా చేయాలన్న డిమాండ్ తో ఆదివారం కూడా ఢిల్లీలో ఆందోళనలు కొనసాగాయి. కాక్రోచ్ జనతా పార్టీకి(Cockroach Janata Party) మద్దతుగా వామపక్ష పార్టీల విద్యార్థి విభాగాలు ఏఐఎస్‌ఏ, ఎస్‌ఎఫ్‌ఐ కన్నాట్ ప్లేస్‌లో మెరు పు ధర్నాకు దిగాయి. భారీగా స్టూడెంట్లు త రలివచ్చి ఇందులో పాల్గొన్నారు. ‘సేవ్ డెమొక్రసీ’ నినాదాలతో హోరెత్తించారు.

జ్ఞానేశ్ రాజీనామా చేసే వరకు ఉద్యమాన్ని ఆపబోమని హెచ్చరించారు. అక్రమ అరెస్టుల ను సహించబోమన్నారు. శనివారం ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారని, వారందరినీ విడుదల చేయాల్సిందేన ని, శాంతియుత నిరసనలకు అడ్డుకుంటే ఊరుకోబోమని తేల్చిచెప్పారు. వారందరినీ పోలీసులు అరెస్ట్ చేసిన వ్యాన్లలో వివిధ ప్రాంతాలకు తరలించారు.

కొందరిని ఈడ్చుకెళ్లారు. సీపీఎం రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సదర్భంగా ఆయనకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా, ఇతర ప్రాంతాల్లోనూ సీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి. 

నేడు ఇండీ కూటమి భారీ ర్యాలీ

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండీ కూటమి సోమవారం ఢిల్లీలో మహా ర్యాలీకి పిలుపునిచ్చింది. ఇప్పటికే వరుసగా మూడునాలుగు రోజులు హస్తినలో నిరసనలు తెలిపిన నేతలు.. ఇప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. భారీగా తరలిరావాలని ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లోని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ హైకమాండ్ పిలుపునిచ్చింది. కూటమిలోని మిగితా పార్టీలు కూడా తమ శ్రేణులను ఢిల్లీకి రప్పిస్తున్నాయి. ఆందోళనలో భాగం గా సుప్రీంకోర్టు వరకు ఇండీ కూటమి నేతలు ర్యాలీ చేపట్టనున్నారు.

ప్రధాన న్యాయమూర్తిని కలిసి వినతిపత్రం అందజేస్తామని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాల్సిందేనని కూటమి డిమాండ్ చేస్తున్నది. ఈ నెల 6, 7న ఇండీ కూటమి ఆధ్వర్యంలో జరిగిన నిరసనలు హైటెన్షన్‌కు దారితీయడంతో తాజా ర్యాలీ దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. 

కలవడానికి సీజేఐ నో!

సోమవారం సుప్రీంకోర్టు వరకు భారీ ర్యాలీ చేపట్టి.. ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను కలవాలని ఇండీ కూటమి నిర్ణయించగా, ఆయన మాత్రం కలిసేందుకు నో చెప్పారు. ఇప్పటికే ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాలు సుప్రీంకోర్టు విచారణలో ఉన్నాయని, ఇలాంటి సమయంలో వారితో సమావేశం కావడం సముచి తం కాదని, అందుకే సీజేఐ నిరాకరిం చారని ఆదివారం ఆయన కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రాథమిక హక్కులకు రక్షణకోరే నేతలు కోర్టును ఆశ్రయించ వచ్చని తెలిపాయి.  

మరిన్ని వార్తలు