జ్ఞానేశ్ అప్రూవర్‌గా మారాలి

13-10-2026 | 05:20am
  1. మోదీ జాతకం మా దగ్గర ఉంది
  2. ఇక శివతాండవమే.. 
  3.    200 మంది ఆఫీసర్లు మాతో టచ్‌లో ఉన్నారు
  4. దేశ ఆత్మగౌరవం కోసమే మా ఉద్యమం
  5. ఢిల్లీని జైలుగా మార్చుతారా? అని ఆగ్రహం

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: సీఈసీ జ్ఞానేశ్‌కుమార్(CEC Gyanesh Kumar) రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారాలని, అప్పటివరకు తాము వదిలిపెట్టబోమని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) హెచ్చరించారు. ఆయన వెనుక ఉన్న పెద్ద శక్తులపైనే తమ పోరాటామని, మోదీ(Modi) జాతకం తమ దగ్గర ఉందని పేర్కొన్నారు. ‘సీఈసీ జ్ఞానేశ్ వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు. మోదీ(Modi), అమిత్ షా దగ్గరుండి నడిపిస్తున్నారు. 12ఏండ్లుగా దేశం అన్నీ గమనిస్తున్నది. ఇక సహించే ప్రసక్తి లేదు. దేశ ప్రజలంతా ఒక్కటయ్యారు’ అని తెలిపారు.

సీజేఐ తమకు అపాయింట్‌మెంట్‌ను నిరాకరించడంపై సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని సీజేఐకి చెప్పాలనుకున్నాం. అందుకే ఆయన అపాయింట్‌మెంట్ కోరాం. కానీ, తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారో తెలియదు. పిటిషన్ వేసుకొమ్మన్నారు. ఆ ప్రకారమే ముందుకు వెళ్తున్నాం’ అని చెప్పారు. 

జ్ఞానేశ్‌కు నిద్రపట్టడం లేదు

ఓట్ చోరీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలతో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌కు నిద్ర పట్టడం లేదని, నిద్ర లేని రాత్రులు గడుపు తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. ‘జ్ఞానేశ్ తప్పులు చేశారు. అయితే, ఆ తప్పుల వెనుక అసలు సూత్రధారి ఆయన కాదు.  అందుకే రాజీనామా చేసి అప్రూవర్‌గా మారాలి. ప్రజల కోసం పనిచేయాలి. అప్పు డు క్షమిస్తాం’ అని పేర్కొన్నారు. ప్రజలందరూ ఒకవైపు ఉంటే.. మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్, అజిత్ దోవల్, జ్ఞానేశ్‌కుమార్ మరోవైపు ఉన్నారని తెలిపారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. తప్పు చేసినవారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని ఆయన హెచ్చరించారు. 

టచ్‌లో 200 మంది ఆఫీసర్లు

ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వంలోని 200 మంది సీనియర్ ఆఫీసర్లు తమతో ట చ్‌లో ఉన్నారని..  ఎన్నికల కమిషన్‌లో జరు గుతున్న అక్రమాలను భరించలేక వారు తమ కు సమాచారం ఇస్తున్నారని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ అధికారులు సీబీఐ, ఈడీ, విదేశాంగ శాఖల్లో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆ ఆఫీసర్లు తమను సంప్రదిస్తున్నారని రాహుల్ పేర్కొన్నారు.  

ఇది శివతాండవం

12ఏండ్లుగా కేంద్రంలోని మోదీ సర్కార్ చేస్తున్న అక్రమాలను ప్రజలు గమనిస్తూ వచ్చారని, ఇప్పుడు ప్రత్యక్ష పోరాటానికి దిగారని రాహుల్ గాంధీ అన్నారు. ‘ఈ పోరా టం ఆగదు. ప్రజల సహనాన్ని పరీక్షిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మోదీకి కనిపిస్తున్నది. ఇది శివతాండవం. తప్పుచేసినవాళ్లు, అక్రమార్కులు కొట్టుకుపోతారు. ఈ తాండవంలో ఎవరైనా చేరొచ్చు’ అని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు దేశ ప్రజలంతా ఏకమయ్యారని.. వారి ముందు మోదీ సర్కార్ తలవంచాల్సిందేనని తెలిపారు. 

ఢిల్లీని జైలుగా మార్చారు

దేశ రాజధాని ఢిల్లీని మోదీ సర్కార్ జైలుగా మార్చిందని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రెండురోజుల కింద యువత రోడ్ల మీదికి వచ్చి సీఈసీకి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతుంటే.. ఎక్కడికక్కడ నిర్బంధాలు చేపట్టారు. అరెస్టు చేశారు. రోడ్లపై 30వేల మంది పోలీసులను మోహరించారు.  అక్రమ అరెస్టులతో ప్రజలను అడ్డుకోవాలని మోదీ చూస్తున్నారు. ఢిల్లీని జైలుగా మార్చారు. ఎన్ని నిర్బంధాలు విధించినా ప్రజలు ఉద్యమాన్ని ఆపబోరు.

సీఈసీ పదవి నుంచి జ్ఞానేశ్ దిగిపోయేవరకు, ఎన్నికల వ్యవస్థలో సమూల మార్పులు జరిగే వరకు ఈ దేశ యువత పోరాటాన్ని ఆపదు. జ్ఞానేశ్‌కుమార్‌ను మోదీ సర్కార్ ఎన్ని రోజులు కాపాడుతుందో చూస్తాం’ అని హెచ్చరించారు. మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్, అజిత్ దోవల్, జ్ఞానేశ్‌కుమార్ కలిసి దేశ అస్తిత్వంపై దాడి చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘ఆ ఐదుగురు తప్పించుకోలేరు. వారిపై మా పోరాటం ఆగదు. ఇది దేశ ఆత్మగౌరవం కోసం జరుగుతున్న ఉద్యమం. మోదీ జాతకం మా దగ్గర ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు