రైతులు చస్తుంటే.. రేవంత్ ఢిల్లీకి
క్యాబినెట్ మీటింగ్ రద్దు చేసి పారిపోయిన సీఎం రేవంత్‌రెడ్డికి శ్రీరాముడి పేరు ఎత్తే అర్హతే లేదు
6 గ్యారెంటీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేసేవరకూ రాహుల్ గాంధీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వబోం
సీఈవో ఆఫీసుకు నేనొస్తానని పొన్నంకు సవాల్
టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు ఫైర్
హైదరాబాద్, అక్టోబర్ 12 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో(Impact of El Niño) పంటలు ఎండిపోతూ.. తీవ్ర కరవు ముంచుకొచ్చి రైతులు(Farmers) చస్తుంటే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ఢిల్లీకి పారిపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు(N. Ramchander Rao) విమర్శించారు. రేవంత్‌రెడ్డికి శ్రీరాముడి(Sri Rama's) పేరు ఎత్తే అర్హత కూడా లేదన్నారు. ‘మీకు న్న ఆ రాక్షస లక్షణాలకు ఒసామా బిన్ లాడెనే స రిపోతా రని ఎద్దేవా చేశారు. 6 గ్యారెంటీలు(6 Guarantees), ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేసేవరకూ రాహుల్ గాంధీని(Rahul Gandhi) తెలంగాణలో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సో మవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎన్ గౌతంరావు, వీరేందర్‌గౌడ్, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, బీజే పీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌ఛార్జ్ ఎన్వీ సుభాష్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అభిషేక్, సురేష్, వెంకట్ రెడ్డితో కలిసి రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడా రు. గుజరాత్ ముఖ్యమంత్రి గా 12 సంవత్సరా లు, దేశ ప్రధానిగా 12 ఏండ్లుగా నిస్వార్థ ప్రజాసేవ అందిస్తున్న మోదీ సమర్థవంతమైన నాయక త్వాన్ని ప్రశంసిస్తూ ఆది వారం జరిగిన పార్టీ సమావేశంలో తీర్మానం చేసినట్లు తెలిపారు.
ఓట్లు మిస్ అయ్యాయంటూ మంత్రి పొన్నం ప్ర భాకర్ చేసిన ఛాలెంజ్ ను తాను స్వీకరిస్తున్నానని స్పష్టం చేశారు. ‘మీరు వేలమందిని తీసుకురానక్కర్లేదు, స్టేట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) దగ్గరకు మీ వెంట మీ మజ్లిస్ దోస్తులు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీలను తీసుకొచ్చినా పర్లే దు.. కనీసం ఓట్లు పోయిన 10 మందిని సీఈవో ఆఫీసుకు తీసుకు రండి. నేనూ వస్తాను. కంప్యూటర్లలో రికార్డులు పరిశీలిద్దాం. నిరూపించలేకపో తే క్షమాపణ చెప్పాలి’ అని ఆయన సవాల్ విసిరారు.
గోవా కాంగ్రెస్ యాత్రలో నిలబడి బీజేపీని ‘రావణుడు’, తమను ‘రాముడు’ అని రేవంత్‌రెడ్డి పోల్చుకోవడం అత్యంత హాస్యాస్పదమని రాం చందర్‌రావు ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో ముస్లిం ఈజ్ కాంగ్రెస్.. - కాంగ్రె స్ ఈజ్ ముస్లిం అన్న రేవంత్‌రెడ్డికి రాముడి పేరు పలికే నైతిక హక్కు ఎక్కడుందని ప్రశ్నించారు.
ఎమర్జెన్సీ విధించి లక్షలాది మందిని జైళ్లలో పెట్టి, బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి, 9 సార్లు ప్రజా ప్రభుత్వాలను బర్తరఫ్ చేసిన రాక్షస లక్షణాలున్నది కాంగ్రెస్ పార్టీకేనని దుయ్యబట్టారు. కావున ‘మీకు లాడెన్ సరిపోతాడు తప్ప శ్రీరాముడు ఎట్లా అవుతాడు?’ అని ప్రశ్నించారు. తెలంగాణలో నిత్యం దేవాలయాలపై దాడులు జరుగుతుంటే పట్టించుకోని వీళ్లు హిందూ సమా జం ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
క్యాబినేట్ రద్దు చేసుకోని పోవడమా?
తెలంగాణలో ఎల్ నినో ప్రభావంతో కరవు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అక్టోబర్ 9న కరవు పరిస్థితులపై సమీక్ష నిర్వహించాలని ప్రభు త్వ ప్రధానకార్యదర్శి (సీఎస్) స్వయంగా ‘మోస్ట్ ఇమ్మీడియట్’ నోట్ పంపించినప్పటికీ.. అత్యవసర క్యాబినెట్ భేటీని రద్దు చేసుకుని సీఎం రేవం త్ రెడ్డి 60మంది మంత్రులు, ఎమ్మెల్యేలతో స్పె షల్ ఫ్లైట్లు వేసుకుని ఢిల్లీకి పోవడం ఎంత నిర్లక్ష్యమని మండిపడ్డారు. హైదరాబాద్‌లో నీళ్లు లేక, పల్లెల్లో కరెంట్ కోతలతో ప్రజలు అల్లాడుతుంటే.. రాహుల్ గాంధీ చేసే పిచ్చి తుగ్లక్ పనుల కోసం ప్రజాధనంతో ఢిల్లీకి వెళ్లి ధర్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల సంఘం, రాష్ట్రపతి వద్ద ఎలాంటి ఆధారాలూ చూపలేకపోయిన కాంగ్రె స్, ప్రశాంత్ కిషోర్ వంటి అర్బన్ నక్సల్స్ సహకారంతో దేశంలో హింసను, అరాచకాన్ని ప్రేరేపించాలని చూస్తోందని ఆరోపించారు. ఇండి యా ఏమీ బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ కాదు.. ఇక్కడ మీ ఆటలు సాగవని, రాబోయే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, గుజరాత్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్, ఇండి కూటమి ఈ అరాచక నాటకాలాడుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.
బీజేపీ ప్రజా ఉద్యమం
రైతులకు ఫసల్ బీమా యోజన అమలు చే యాలని, రబీ పంటకు నీళ్లు, కరెంట్ ఎలా ఇస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వంపై బీజేపీ ప్రజా ఉద్యమం నిర్మిస్తుందని హెచ్చరించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేసేంతవరకు రాహుల్‌గాంధీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వబోమని పేర్కొన్నారు.