సౌదీ విమానాశ్రయంపై భీకర దాడి
- రియాద్‌లోని కింగ్ ఖాలిద్ టెర్మినల్స్ 3, 4, 5పై క్షిపణులు
- 12 మంది మృతి.. 309 మందికి పైగా గాయాలు
- క్షతగాత్రుల్లో 11 మంది భారతీయులు
- జోక్యం చేసుకోవాలా? వద్దా? పరిశీలిస్తాం : ట్రంప్
కైరో, అక్టోబర్ 11: యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతుగల హౌతీలకు, సౌదీ అరేబియాకు మధ్య రోజురోజుకూ యుద్ధం ఉధృతమవుతోంది. సౌదీ అరేబియా(Saudi Arabia) రాజధాని రియాద్‌లోని(Capital Riyadh) కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై(King Khalid International Airport) శనివారం అర్ధరాత్రి క్షిపణి దాడి జరిగింది. దేశీయ విమాన సర్వీసులు నడిచే టెర్మినల్స్ 3, 4, 5 కాంప్లెక్స్‌లపై క్షిపణులు ఢీకొట్టాయి.
భీకర క్షిపణి దాడిలో 12 మంది మృతిచెందారు. మరో 309 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిలో 11 మంది భారతీయులు ఉన్నట్లు భారత రాయబార కార్యాలయం తెలి పింది. విమానాశ్రయ ప్రాంగణం రక్తసిక్తమైంది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. దీంతో సౌదీ పౌర విమానయాన సంస్థ ఎయిర్‌పోర్టు ను మూసివేసింది.
యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారులు ఈ దాడికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు. మరోపక్క హౌతీలు సౌదీ అంతటా వైమానిక దాడులు చేస్తామని హెచ్చరించారు. అయితే ఈ తిరుగుబాటుదారులపై సౌదీ దాడులలో చేరాలా వద్దా అనే విషయాన్ని తాను పరిశీలిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ పేర్కొ న్నారు.
ఈ పరిణామంతో కూడా హౌతీలు రెచ్చిపోతున్నారు. మరోపక్క యెమెన్ రాజధాని సనాపై రెండు వైమానిక దాడులు జరిగాయని, అందుకు సౌదీ అరేబియానే కారణమని హౌతీలు ఆరోపిం చారు. ఫ్లైట్రాడార్24 ప్రకారం.. సౌదీ అధికారులు శనివారం విమానాశ్ర యంపై దాడి తర్వాత మూసివేతను ఆదివారం వరకు పొడిగించారు.
దీంతో ఎయిర్ ఇండియా, లుఫ్తాన్సా, ఫ్లైదుబాయ్, కువైట్ ఎయిర్వేస్ వంటి అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ రియాద్‌కు తమ సర్వీసులను నిలిపివేసాయి. మరికొన్నింటిని వేరే ప్రాంతాలకు మళ్లించాయి. అయితే సౌదీ అరే బియా విమానాశ్రయాలు తమ టార్గెట్‌లో ఉన్నాయని హౌతీలు వార్నింగ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ తమ హెచ్చరికలను తీవ్రంగా పరిగణించా లని ఆ గ్రూపు సైనిక ప్రతినిధి జనరల్ యాహ్యా సరీ స్పష్టం చేశారు. అయితే ఈ దారుణ దాడిపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
సౌదీ విమానాశ్రయంపై తాజా దాడిని ఇరాక్, లెబనాన్, సిరియాతో సహా అరబ్ దేశాలు ఖండించాయి. అలాగే ఐక్యరా జ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా ఖండించారు. దేశీయ విమానాల కోసం టెర్మినల్స్ 3, టెర్మినల్ 4, ప్యాసింజర్ టెర్మినల్5 సముదాయం పై దాడి జరిగిం దని ఓ ప్రాంతీయ అధికారి తెలిపారు.
12 మంది మృతి చెందగా, వీరిలో నలుగురు సౌదీ పౌరులు, ఇద్దరు బంగ్లాదేశీయులు, ఒక పాలస్తీని యన్, ఒక అమెరికా పౌరుడు, ఒక ఈజిప్షియన్, ఒక జోర్డాన్, ఒక సిరియన్, ఒక సూడానీయుడు ఉన్నారని సౌదీ తెలిపింది. 309మందికి పైగా గాయపడిన వారికి పలు ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది.
గాయపడిన వారిలో 11 మంది భారతీయులు ఉన్నారని, వారి యోగక్షేమాలను విచారించడానికి స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని రాయబార కార్యాలయం చెప్పింది.
హైదరాబాద్ వ్యక్తి మృతి
హైదరాబాద్, అక్టోబర్ 11: సౌదీ అరేబియాలోని రియాద్ విమానాశ్రయంపై జరిగిన దాడిలో హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ యూసుఫ్ అలీ మరణించాడు. అతని కుటుంబంలో ముగ్గురు సభ్యులు గాయపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఎంపీ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. బాధిత కుటుంబం నగరంలోని మెహదీపట్నానికి చెందినది అని ఎక్స్‌లో పోస్టు చేశారు. ఆయన ఇద్దరి కుమారులు, అత్తకు గాయాలవగా, కుమార్తె, భార్య సురక్షితంగా ఉన్నారు.