సత్యాన్ని అణచివేస్తే ప్రతిఘటిస్తాం
- సత్యం పక్షాన నిలబడటమే గొప్ప ఆయుధం
- మీ కోసం ఏ చోటైనా సరే..
- నా శక్తిమేర కృషి చేస్తా
- నిరసన గళాలను ఏకం చేయడమే ‘సత్యాగ్రహ’ లక్ష్యం
- కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ
న్యూఢిల్లీ,అక్టోబర్3: దేశవ్యాప్తంగా సత్యా న్ని అణచివేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ(Congress leader Rahul Gandhi) ఆరోపించారు. ఈ అణచివేతను ప్రతిఘటించడమే ప్రతిపక్ష నేతగా తన బాధ్యత అని, ఈ విషయంలో ప్రతిచోటా ప్రజలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. సత్యమే మన గొప్ప ఆయుధమని బాపూజీ మనకు బోధించారు. కానీ సత్యం పక్షాన నిలబడటం కూడా అంతకంటే గొప్ప ఆయుధమని అన్నారు. ‘మీ కోసం ఏ చోటైనా సరే.. నా శక్తిమేర కృషి చేస్తా’ అని తేల్చిచెప్పారు.
దేశవ్యాప్తంగా ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారని, ఈ ఒంటరి గళాలను ఏకం చేయడమే ‘సత్యాగ్రహ’ డిజిటల్ వేదిక లక్ష్యమని రాహుల్ గాంధీ వెల్లడించారు. మహాత్మాగాంధీ 157వ జయంతి మరుసటి రోజైన శనివారం రాహుల్ న్యూఢిల్లీలో ‘సత్యాగ్రహ’ డిజిటల్ వేదికను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. సత్యం అణచివేయబడుతున్న చోట ప్రజలకు సహాయం అందేలా చూసేందుకు ఈ వేదిక అవసరమని, ప్రభుత్వంపై తమ నిరసన లను ఈ వేదికపై నమోదు చేయాలని ప్రజలను కోరారు. దేశంలో ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారని, అయితే తరచుగా ఒంటరిగానే పోరాడాల్సి వస్తోందన్నారు. ‘జెన్-జెడ్’ యువత, విద్యార్థులు, రైతులు, ఆదివాసీలు, దళితులు, మహిళలు... ఇలా ప్రతి పోరా టానికి ఒక ప్రత్యేక కథనం ఉంది.
కానీ ఒంటరి గళాన్ని అణచివేయడం సుల భం. ‘ఆ గళాలన్నింటినీ ఒకే వేదికపైకి (మ్యాప్‌పైకి) తీసుకు రావడమే ‘సత్యాగ్రహ’ లక్ష్యం అని ఆయన ‘ఎక్స్’లో పేర్కొన్నారు. మహాత్మాగాంధీని స్మరించుకుంటూ, ‘సత్యమే మన గొప్ప ఆయుధమని బాపూజీ మనకు బోధించారు. కానీ సత్యం పక్షాన నిలబడటం అంతకంటే గొప్ప ఆయుధం. మీరు కూడా ఏదైనా అన్యాయానికి వ్యతిరే కంగా పోరాడుతుంటే, మీ కథనాన్ని ఈ వేదికలో పంచు కోండి.
దీనికి కేవలం రెండు నిమిషాలు మాత్రమే పడుతుంది’ అన్నారు. ‘మీలాగే సొంత పోరాటం చేస్తున్న ఇతరులు ఎవరో కూడా మీరు చూడవచ్చు’ అని తెలిపారు. ‘మీకు అండగా నిలవడానికి పార్లమెంటులో, వీధుల్లో, లేఖల ద్వారా లేదా నేను అవసరమైన ఏ చోటైనా సరే... నా శక్తిమేర కృషి చేస్తాను. ప్రతిపక్ష నాయకుడిగా అది నా బాధ్యత. మీ సత్యాగ్రహం గురించి కథను నాకు చెప్పండి’ అని స్పష్టం చేశారు.
భూమి హక్కులు, మహిళల హక్కులు, దళిత హక్కులు, ఓబీసీ హక్కులు, విద్య, పరీక్షలకు సంబంధించిన అంశాలపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ నిరసనలను వ్యవస్థీకరించడంలో, వాటిని ఒకే వేదికపైకి తీసుకురావడంలో, ‘మీరు పోరాడుతున్న సమస్యల పరిష్కారానికి సహాయపడేలా మీతో పనిచేయడానికి మేము తోడుంటాం. సత్యాగ్రహ వెబ్‌సైట్‌ను చూ డండి. ఫారమ్‌ను నింపండి. మీ ఉద్యమాన్ని నమోదు చేయండి’ అని పేర్కొన్నారు.